CI Nageswara Rao : ఖాకీ మాటున కాలనాగులా కాటేశాడు.. మాజీ సీఐ నాగేశ్వరరావు రిమాండ్ రిపోర్టులో షాకింగ్ విషయాలు

ఖాకీ డ్రెస్ మాటున నాగేశ్వరరావు ఎన్నో దారుణాలకు పాల్పడ్డాడని పోలీసులు గుర్తించారు. ఎంతోమందిని కాలనాగులా కాటేశాడని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.

CI Nageswara Rao : వివాహితపై అత్యాచారం, కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన మారేడ్ పల్లి మాజీ సీఐ నాగేశ్వరరావు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగుచూశాయి. ఖాకీ డ్రెస్ మాటున నాగేశ్వరరావు ఎన్నో దారుణాలకు పాల్పడ్డాడని పోలీసులు గుర్తించారు.

Ex CI Nageswara Rao : కటకటాల్లోకి ఖాకీ కామ పిశాచి.. చర్లపల్లి జైలుకి నాగేశ్వరరావు

నిన్న రాత్రి నాగేశ్వరరావుని పోలీసులు హయత్ నగర్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, 14 రోజుల రిమాండ్ విధించారు మేజిస్ట్రేట్. దీంతో నాగేశ్వరరావుని పోలీసులు చర్లపల్లి జైలుకి తరలించారు. అటు నాగేశ్వరరావుపై శాఖాపరమైన విచారణ కూడా జరుగుతోంది. ఖాకీ డ్రెస్ మాటున నాగేశ్వరరావు ఎంతోమందిని కాలనాగులా కాటేశాడని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.

వివాహితపై అత్యాచారం, కిడ్నాప్, బెదిరింపులు, ఆర్మ్స్ యాక్ట్ కింద ఖాకీ కామపిశాచి నాగేశ్వరరావును కటకటాల్లోకి నెట్టారు పోలీసులు. ఈ కేసుని వనస్థలిపురం ఏసీపీ నేతృత్వంలోని స్పెషల్ టీమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. ఇప్పటికే పలు కీలక ఆధారాలు సేకరించిన సిట్.. ప్రాథమిక దర్యాఫ్తులో నేరం రుజువైందని తేల్చింది సిట్.

Nageswara Rao : సీఐ నాగేశ్వరరావుని ఎన్‌కౌంటర్ చేయాల్సిందే, లేదంటే చంపేస్తాడు-బాధితుడు నాగిరెడ్డి

అటు బెదిరింపులకు పాల్పడ్డ రివాల్వర్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. రివాల్వర్ ను గురిపెట్టి కిడ్నాప్ కు పాల్పడుతున్న సమయంలోనూ ఆ దృశ్యాలు చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినట్లు గుర్తించారు సిట్ పోలీసులు. ఇప్పుడు వాటిని సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అటు లైంగిక దాడి ఘటనా స్థలం నుంచి ఇబ్రహింపట్నం యాక్సిడెంట్ వరకు కీలక ఆధారాలు సేకరించింది సిట్. ఈ కేసులో బాధితురాలికి మెడికల్ టెస్ట్ కీలకం కానుంది. అదే సైంటిఫిక్ ఎవిడెన్స్ గా ఉపయోగపడనుంది. స్థానికుల ఐ విట్నెస్ స్టేట్ మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు టవర్ లొకేషన్ ట్రేస్ చేసే పనిలో పడ్డారు.

CI Nageswara Rao Case : సీఐ నాగేశ్వరరావు కేసులో కీలక ఆధారాలు సేకరణ

వీటికి తోడు సీఐగా సెటిల్ మెంట్లు, వసూళ్లు, బెదిరింపుల ఆరోపణలు నాగేశ్వరరావుపై వస్తుండటంతో సమగ్రంగా దర్యాఫ్తు చేయాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు. నాగేశ్వరరావు అవినీతి అక్రమాలు, ఆస్తుల చిట్టాను కూడా ఓపెన్ చేసే పనిలో ఉంది సిట్.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ఈ కేసులో నాగేశ్వరరావుని ఎన్ కౌంటర్ చేస్తేనే తమకు న్యాయం జరుగుతుందని బాధితుడు అంటున్నాడు. లేదంటే తమకు చావే గతి అని వాపోతున్నాడు. నాగేశ్వరరావు చాలా పలుకుబడి కలిగిన వ్యక్తి అని, ఎవరితోనైనా ఏ పని అయినా చేయించగలడని, డబ్బులు ఇచ్చి రౌడీషీటర్ తో తమను చంపేయిడని బాధితుడు ఆరోపించాడు. ఈ కేసులో బాధితులకు రక్షణ ఇవ్వాల్సిన పోలీసులు.. వాళ్ల డిపార్ట్ మెంట్ కు చెందిన వ్యక్తి కావడంతో నాగేశ్వరరావుకే సపోర్ట్ చేస్తున్నారని, అతడికే రక్షణ కల్పిస్తున్నారని బాధితుడు ఆరోపించాడు.

ట్రెండింగ్ వార్తలు