Nageswara Rao : సీఐ నాగేశ్వరరావుని ఎన్‌కౌంటర్ చేయాల్సిందే, లేదంటే చంపేస్తాడు-బాధితుడు నాగిరెడ్డి

నాగేశ్వరరావుకి చాలా పలుకుబడి ఉంది. ఎవరితోనైనా ఏమైనా చేపిస్తాడు. మేము బతికే పరిస్థితి లేదు. మేము ప్రాణాలతో ఉండాలంటే.. కచ్చితంగా నాగేశ్వరరావుని ఎన్ కౌంటర్ చేయాల్సిందే.

Nageswara Rao : సీఐ నాగేశ్వరరావుని ఎన్‌కౌంటర్ చేయాల్సిందే, లేదంటే చంపేస్తాడు-బాధితుడు నాగిరెడ్డి

Nageswara Rao

Nageswara Rao : మాజీ సీఐ నాగేశ్వరరావు చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి అని, న్యాయం జరక్కపోతే తమకు చావే గతి అంటున్నాడు బాధితుడు నాగిరెడ్డి. కేసు పెట్టి నాలుగు రోజులు అయినా ఇంతవరకు పురోగతి లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితులకు రక్షణ ఇవ్వాల్సిన పోలీసులు.. వాళ్ల డిపార్ట్ మెంట్ కు చెందిన వ్యక్తి కావడంతో నాగేశ్వరరావుకే సపోర్ట్ చేస్తున్నారని బాధితుడు నాగిరెడ్డి వాపోయాడు.

CI Nageswara Rao : వివాహితపై అత్యాచారం కేసు.. కీచక ఖాకీపై సస్పెన్షన్ వేటు

మారేడ్ పల్లి మాజీ సీఐ నాగేశ్వరరావుని కఠినంగా శిక్షించాలి. మాకు న్యాయం జరగాలి. లేకపోతే మాకు చావే గతి. పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు. నాగేశ్వరరావు మమ్మల్ని తీవ్రంగా వేధించాడు. మమ్మల్ని బతకనివ్వడు. కేసు పెట్టి నాలుగు రోజులు అవుతున్నా చర్యలు తీసుకోలేదు. మమ్మల్ని ఎన్ కౌంటర్ చేస్తానన్నాడు. దీంతో అతడి కాలర్ పట్టుకున్నాడు. ఆ సమయంలో నాగేశ్వరరావు సింగిల్ హ్యాండ్ తో డ్రైవింగ్ చేస్తున్నాడు. కారు అదుపుతప్పి యాక్సిడెంట్ అయ్యింది.

CI Nageswara Rao : ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న సీఐ నాగేశ్వరరావు అక్రమాలు

దాంతో నేను, నా భార్య నాగేశ్వరరావు బారి నుంచి తప్పించుకున్నాం. బస్సు ఎక్కి వచ్చేశాము. బంధువుల సలహా మేరకు నాగేశ్వరరావుపై పోలీసులకు ఫిర్యాదు చేశాము. కేసు పెట్టి నాలుగు రోజులు అవుతున్నా ఇంకా ఎందుకు నాగేశ్వరరావుని ఎన్ కౌంటర్ చేయడం లేదు. మాకు న్యాయం జరగాలి. పోలీసులతో నన్ను కొట్టించాడు. నా చేతిలో గంజాయి ప్యాకెట్లు పెట్టి దొంగ కేసుల్లో ఇరికిస్తానని, చంపేస్తానని బెదిరించాడు. రూ.5లక్షలు ఇచ్చి ఓ రౌడీషీటర్ తో నన్ను చంపేపిస్తానని వార్నింగ్ ఇచ్చాడు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ఈ ఘోరాన్ని భరించలేకపోతున్నాం. మాకు చావాలనిపిస్తోంది. మమ్మల్ని వేధించిన వ్యక్తికి రక్షణ కల్పిస్తున్నారు. బాధితులైన మాకు రక్షణ కల్పించడం లేదు. కచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి. ఇంతకుముందు కేసుల్లో బాధితులకు ఏ విధమైన న్యాయం చేశారో అదే న్యాయం మాకూ చేయండి. నాగేశ్వరరావుని ఎన్ కౌంటర్ చేస్తేనే మాకు న్యాయం జరుగుతుంది. నాగేశ్వరరావుకి చాలా పలుకుబడి ఉంది. ఎవరితోనైనా ఏమైనా చేపిస్తాడు. మేము బతికే పరిస్థితి లేదు. మాకు ఇల్లు దొరకదు, పనీ దొరకదు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లే పరిస్థితి కూడా లేదు. కచ్చితంగా నాగేశ్వరరావుని ఎన్ కౌంటర్ చేయాల్సిందే” అని బాధితుడు నాగిరెడ్డి ప్రభుత్వాన్ని వేడుకున్నాడు.

CI Nageswara Rao Case : సీఐ నాగేశ్వరరావు కేసులో కీలక ఆధారాలు సేకరణ