Ex CI Nageswara Rao : కటకటాల్లోకి ఖాకీ కామ పిశాచి.. చర్లపల్లి జైలుకి నాగేశ్వరరావు

ఖాకీ కామ పిశాచి కటకటాల్లోకి వెళ్లాడు. వివాహితపై అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన మారేడ్ పల్లి మాజీ సీఐ నాగేశ్వరరావుని పోలీసులు చర్లపల్లి జైలుకి తరలించారు.

Ex CI Nageswara Rao : కటకటాల్లోకి ఖాకీ కామ పిశాచి.. చర్లపల్లి జైలుకి నాగేశ్వరరావు

Ex Ci Nageswara Rao

Ex CI Nageswara Rao : ఖాకీ కామ పిశాచి కటకటాల్లోకి వెళ్లాడు. వివాహితపై అత్యాచారం, కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన మారేడ్ పల్లి మాజీ సీఐ నాగేశ్వరరావుని వనస్థలిపురం పోలీసులు సోమవారం రాత్రి హయత్ నగర్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అత్యాచారం కేసులో నాగేశ్వరరావుకి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు న్యాయమూర్తి. దీంతో పోలీసులు నాగేశ్వరరావుని చర్లపల్లి జైలుకి తరలించారు.

CI Nageswara Rao : ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న సీఐ నాగేశ్వరరావు అక్రమాలు

వివాహితపై అత్యాచారం కేసులో ఎస్వోటీ పోలీసులు, వనస్థలిపురం పోలీసులు నాగేశ్వరరావుని అరెస్ట్ చేశారు. రెండురోజుల పాటు పూర్తి స్థాయిలో విచారించారు. నాగేశ్వరరావు స్టేట్ మెంట్ కూడా నమోదు చేశారు. అదే సమయంలో బాధితుల ఇంటికి వెళ్లిన పోలీసులు వారి స్టేట్ మెంట్ కూడా తీసుకున్నారు.

Nageswara Rao : సీఐ నాగేశ్వరరావుని ఎన్‌కౌంటర్ చేయాల్సిందే, లేదంటే చంపేస్తాడు-బాధితుడు నాగిరెడ్డి

తెలంగాణ పోలీస్ డిపార్ట్ మెంట్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మహిళలకు భద్రత కల్పించాల్సిన స్టేషన్ ఆఫీసరే మహిళపై అత్యాచారానికి ఒడిగట్టాడన్న ఆరోపణలు డిపార్ట్ మెంట్ లో కలకలం సృష్టించాయి. కిడ్నాప్, అత్యాచారం, ఆయుధాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మారేడ్ పల్లి ఇన్ స్పెక్టర్ నాగేశ్వరరావుపై వేటు పడింది.

పోలీస్ డ్రెస్ వేసుకున్నాం కదా అని ఏం చేసినా అడిగే వారు ఉండరనుకున్నాడో ఏమో బరితెగించి ఇష్టారాజ్యంగా వ్యవహరించాడు నాగేశ్వరరావు. న్యాయం కోసం తన పోలీస్ స్టేషన్ కు వచ్చిన వ్యక్తిని వేధించడమే కాకుండా అతడి భార్యపై అత్యాచారం చేసినట్లుగా నాగేశ్వరరావుపై ఆరోపణలు ఉన్నాయి.