Ktr Legal Fight
Ktr : కాంగ్రెస్ నేతలపై చట్టపరమైన చర్యలకు కేటీఆర్ సిద్ధమవుతున్నారు. తెలంగాణ భవన్ లో లీగల్ సెల్ సభ్యులతో కేటీఆర్ సమావేశం అయ్యారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి కొండా సురేఖ, కేకే మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డికి ఇప్పటికే కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. ఆదివారం వరకు తనకు క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు స్పందించకపోవడంతో చట్టపరమైన చర్యలకు కేటీఆర్ సిద్ధమవుతున్నారు.
ఈ నెల 2వ తేదీన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జి కేకే మహేందర్ రెడ్డి.. తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని లీగల్ నోటీసులు పంపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన ప్రమేయం లేకపోయినా ఈ నేతలంతా కూడా తనను బద్నాం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ నేతల ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న కేటీఆర్.. దీనిపై 5 రోజుల్లో క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలకు తాను రెడీ అవుతున్నానని.. లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు.
తాజాగా ఇదే అంశంపై బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ సభ్యులతో కేటీఆర్ సమావేశం అయ్యారు. చట్టపరంగా ఏ విధంగా ముందుకెళ్లాలని లీగల్ సెల్ సభ్యులతో చర్చించారు. తదుపరి చర్యలకు కేటీఆర్ సిద్ధమవుతున్నారు. వారందరిపై పరువు నష్టం దావా వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : కేసీఆర్ ప్రభుత్వంలో కీలకంగా పని చేసిన అధికారులకు అరెస్ట్ భయం