KTR
Vice President Election 2025: ఉపరాష్ట్రపతి ఎన్నికపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ దూరం ఉంటుందని చెప్పారు.
ఇంతవరకు బీఆర్ఎస్ ను ఏ పార్టీ సంప్రదించలేదని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ నుంచి బీసీ అభ్యర్థులు లేరా అంటూ ప్రశ్నించిన కేటీఆర్.. ఎన్నికలు వచ్చేసరికి బీసీలకు మర్చిపోతారా అని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి మద్దతిచ్చిన అభ్యర్థులకు బీఆర్ఎస్ మద్దతివ్వదని తేల్చి తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీకి ఢిల్లీలో బాస్ ఎవరూ లేరని చెప్పారు. తెలంగాణ ప్రజలే తమ బాస్ అని వ్యాఖ్యానించారు.
”బీఆర్ఎస్ అనేది ఇండిపెండెంట్ పార్టీ. మాకు ఢిల్లీలో బాస్ లు ఎవరూ లేరు. మాకు ఢిల్లీలో బాస్ లేడు, ఏ పార్టీ కూడా మా బాస్ కాదు.
మాకు ఎవరైనా బాస్ లు ఉన్నారంటే తెలంగాణ ప్రజలు మా బాస్ లు. ఢిల్లీలో మాకు పెద్దలు లేరు. మాకు ఆదేశాలు ఇచ్చే వారు లేరు.
మా పార్టీని ఇంతవరకు ఎవరూ సంప్రదించలేదు. ఈ అభ్యర్థి కానీ ఆ అభ్యర్థి కానీ ఈ కూటమి కానీ ఆ కూటమి కానీ ఎవరూ కూడా మమ్మల్ని సంప్రదించలేదు. మమ్మల్ని అడగలేదు.
మేము కూడా ఒక పార్టీగా కేవలం మీడియాలో చూసిందే తప్ప ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుందని మాకు ఇంతవరకు ఎవరూ అడిగింది లేదు, సంప్రదించింది లేదు.
సెప్టెంబర్ 9 ఎన్నిక కాబట్టి కూర్చుని ఆలోచించుకుని ఎన్నిక తేదీ నాటికి మా వైఖరి తెలియజేస్తాం. మేము ఎన్డీయే కూటమిలో లేము, ఇండియా కూటమిలో లేము.
ఏ అభ్యర్థిని సపోర్ట్ చేయాలి అనేదానిపై మాకు ఢిల్లీ నుంచి ఎలా ఒత్తిడి లేదు.
ఏ ఒత్తిడికి తలొగ్గాల్సిన అవసరం మాకు లేదు. తెలంగాణ ప్రజల మూడ్ కి అనుగుణంగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటాం” అని కేటీఆర్ అన్నారు.
ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో రెండు పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ రెండు పార్టీలకు తాము సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు అన్నట్లుగా ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ థర్డ్ క్లాస్ పార్టీ..
ఇండియా కూటమి బలపరుస్తున్న అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి మద్దతిస్తే కనుక ఆ పార్టీ బీఆర్ఎస్ మద్దతివ్వాల్సిన అవసరం లేదన్నారు.
కాంగ్రెస్ పార్టీ థర్డ్ క్లాస్ పార్టీ, దౌర్భాగ్యమైన పార్టీ అంటూ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. (KTR Key Comments)
ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి అటు బీజేపీ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ తమను సంప్రదించలేదన్నారు. ఒకవేళ వారు సంప్రదిస్తే మద్దతు విషయంపై ఆలోచన చేస్తామన్నారు.
పార్టీలో అందరిలో చర్చించిన తర్వాత కేసీఆర్ దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారని కేటీఆర్ స్పష్టం చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్, బీజేపీలకు ఒక ఆఫర్ ఇచ్చారు కేటీఆర్.
బీజేపీ, కాంగ్రెస్.. ఈ రెండింటిలో ఏ పార్టీ అయితే రాష్ట్రానికి 2 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువును ఇస్తామని ముందుగా హామీ ఇస్తుందో వారికి తాము మద్దతిస్తామని కేటీఆర్ చెప్పారు.
Also Read: సీఎం రేవంత్ మాటల వెనుక మర్మమేంటి? రేవంత్‌ది ఆత్మవిశ్వాసమా.? మైండ్ గేమ్ ఆడుతున్నారా.?