KTR Meets KCR : ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో కేటీఆర్ భేటీ అయ్యారు. నిన్నటి ఏసీబీ విచారణ అంశాలను కేసీఆర్ కు కేటీఆర్ వివరించారు. కేటీఆర్ తో పాటు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లారు హరీశ్ రావు. ఏసీబీ విచారణ అంశంతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపై వారంతా చర్చించారు.
కేటీఆర్ తో పాటు కేసీఆర్ ను కలిసిన హరీశ్ రావు..
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నిన్న ఏసీబీ విచారణ ఎదుర్కొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఇవాళ పార్టీ అధినేత కేసీఆర్ ను కలిశారు. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి కేసీఆర్ తో భేటీ అయ్యారు కేటీఆర్. మరో కీలక నేత హరీశ్ రావు కూడా కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై చర్చించారు.
Also Read : ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములను సర్కారు స్వాధీనం చేసుకుంటుంది: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
ఏసీబీ విచారణకు సంబంధించిన అంశాల ప్రస్తావన..
నిన్న ఏసీబీ విచారణకు సంబంధించిన పూర్తి వివరాలను ఇవాళ కేసీఆర్ తో కేటీఆర్ పంచుకున్నట్లు తెలుస్తోంది. అధికారులు ఏయే అంశాలపై దృష్టి సారించారు? ప్రభుత్వం ఎలా వ్యవహరించబోతోంది? అన్నదానిపై కేసీఆర్ తో డిస్కస్ చేసినట్లు సమాచారం. ఎలాంటి అక్రమాలకు పాల్పడకపోయినా కక్ష సాధింపు చర్యలతోనే ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తోందని ముందు నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెబుతూనే ఉన్నారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయ పోరాటం..
అటు కేసీఆర్ కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నిధులు చెల్లించడం జరిగిందని, మున్సిపల్ శాఖ మంత్రిగా తన శాఖలో ఉన్న నిర్ణయానికి అనుగుణంగానే కేటీఆర్ నిధులు చెల్లించారన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. ప్రభుత్వం నమోదు చేస్తున్న అక్రమ కేసుల్లో రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయానికి బీఆర్ఎస్ నేతలు వచ్చినట్లు తెలుస్తోంది.
సుమారు 6 గంటల పాటు కేటీఆర్ విచారణ..
ప్రభుత్వం నమోదు చేస్తున్న అక్రమ కేసులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. నిన్నటి ఏసీబీ విచారణకు సంబంధించి పూర్తి వివరాలను కేసీఆర్ కు తెలిపేందుకు భేటీ కావడం జరిగింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ అధికారులు కేటీఆర్ ను దాదాపు 6 గంటల పాటు విచారించిన సంగతి తెలిసిందే. నిన్న ఉదయం 10.30 గంటలకు ఏసీబీ కార్యాలయానికి వెళ్లిన కేటీఆర్.. దాదాపు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఏసీబీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు.
ఈ ఆరు గంటల పాటు అధికారులు ఏయే అంశాలపై ప్రశ్నలు సంధించారు? విచారణలో భాగంగ ఏయే అంశాలపై ఫోకస్ పెట్టారు? రాబోయే రోజుల్లో ఈ విచారణను, కేసును ఎలా ఎదుర్కోవాలి? అన్న అంశంపైనే కేసీఆర్, కేటీఆర్ మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
Also Read : తెలంగాణ మంత్రులు అలిగారా? తమను చిన్నచూపు చూశారని అవమానంగా ఫీలవుతున్నారా?