ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములను సర్కారు స్వాధీనం చేసుకుంటుంది: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

రెవెన్యూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని, ప్రభుత్వం అంటేనే రెవెన్యూ అని జీవన్ రెడ్డి తెలిపారు.

ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములను సర్కారు స్వాధీనం చేసుకుంటుంది: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

MLC Jeevan Reddy

Updated On : January 10, 2025 / 4:00 PM IST

తెలంగాణలో త్వరలోనే వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను తీసుకొస్తామని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని చెప్పారు. సంక్రాంతి అంటేనే రైతుల పండుగ అని, పండుగ కానుకగా భూ భారతిని అమలులోకి తేవాలని సీఎం రేవంత్‌ రెడ్డికి విజ్ఞప్తి చేస్తానని తెలిపారు.

రెవెన్యూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని, ప్రభుత్వం అంటేనే రెవెన్యూ అని జీవన్ రెడ్డి తెలిపారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా రెవెన్యూ శాఖనే కనిపిస్తుందని అన్నారు. ప్రభుత్వం అంటే ఆనవాళ్లు లేకుండా వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థను కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేసిందని చెప్పారు.

ధరణి వల్ల ప్రజలు ఎదుర్కున్న సమస్యలు భూభారతి వల్ల పరిష్కారం అవుతాయని తెలిపారు. రైతుల సమస్యలు స్థానికంగా పరిష్కరించే వెసులుబాటు భూ భారతిలో ఉందని అన్నారు. కేసీఆర్ బయటకి రావడం, రాకపోవడం ఆయన వ్యక్తిగతమని వ్యాఖ్యానించారు.

రేవంత్ రెడ్డిపై భిన్నాభిప్రాయాలు, ఈర్ష, ద్వేషాలు ఉండవచ్చని జీవన్‌ రెడ్డి చెప్పారు. బాధ్యత గల హోదాలో ఉన్న కేటీఆర్, బండి సంజయ్ ముఖ్యమంత్రి పదవిపై మాట్లాడేప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని అన్నారు. విదేశాల్లో చదువుకున్న కేటీఆర్ సంస్కృతి ఇదేనా అని విమర్శించారు.

Pawan Kalyan: సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకుందామని అనుకున్నాను..కానీ..: పవన్ కల్యాణ్