Pawan Kalyan: సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకుందామని అనుకున్నాను..కానీ..: పవన్ కల్యాణ్

గత ప్రభుత్వంలో కొంతమంది ఉద్యోగులు పనిచేయడం మానేశారని, నిర్లక్ష్యంగా ఉండేవారని పవన్ అన్నారు.

Pawan Kalyan: సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకుందామని అనుకున్నాను..కానీ..: పవన్ కల్యాణ్

Pawan Kalyan

Updated On : January 10, 2025 / 3:41 PM IST

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా 12,500 గోకులాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి రెండు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చే గెలుపును పిఠాపురం ప్రజలు తనకు ఇచ్చారన్నారు.

సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకుందామని అనుకున్నానని, తిరుపతి ఘటన తనను కలచి వేసిందని పవన్ కల్యాణ్ చెప్పారు.
గత ప్రభుత్వాలు టాయిలెట్ కోసం రంగులు వేయడానికి, రంగులు తీయడానికి వేలకోట్ల దుర్వినియోగం చేశాయని తెలిపారు. ఇప్పుడు సరైనదారులు కూడా లేని తండాలకు రాష్ట్ర ప్రభుత్వం 39 కోట్లతో నిధులు కేటాయించిందని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ సహకారంతో వారికి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఏర్పాటు చేస్తానని చెప్పారు. పిఠాపురం ప్రజలకు జన్మాంతం తాను రుణపడి ఉంటానని పవన్ తెలిపారు. ఐదు సంవత్సరాలలో గత ప్రభుత్వాలు 268 గోకులాలను నిర్మించాయని, కూటమి సర్కారు 6 నెలల్లో 12,500 గోకులాలు నిర్మించిందన్నారు.

గత వైసీపీ ప్రభుత్వం స్కాంలలో రికార్డ్ సృష్టిస్తే ఈ ప్రభుత్వం పల్లె పండగల ద్వారా రికార్డు సృష్టిస్తుందని పవన్ కల్యాణ్ చెప్పారు. రెండో దశ క్షీర విప్లవం ద్వారా అడుగులు వేస్తామని అన్నారు. గత ప్రభుత్వాలు గాల్లో నైవేద్యాలు పెట్టి మనకే చేశామని చెప్పి చూపించాయని తెలిపారు.

గత ప్రభుత్వంలో కొంతమంది ఉద్యోగులు పనిచేయడం మానేశారని, నిర్లక్ష్యంగా ఉండేవారని పవన్ అన్నారు. పిఠాపురంలో తాను కొన్న స్థలంలో షెడ్డు వేసుకుని ఉంటానని తెలిపారు. మొదట ఇల్లు సర్దుకుని తర్వాత రాష్ట్రాన్ని సర్దుతానని చెప్పారు. తన పిఠాపురంలో 54 గ్రామాల్లో ప్రతి గ్రామానికి తాను వెళ్లి సమస్యను తెలుసుకుంటానని అన్నారు.

పిఠాపురాన్ని జాతీయస్థాయిలో పేరు తెచ్చుకునే విధంగా అభివృద్ధి చేస్తానని పవన్ హామీ ఇచ్చారు. పిఠాపురంలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఇక్కడ గంజాయి ఎక్కువగా వాడుతున్నారని తన దృష్టికి వచ్చిందని, దానిపై పోలీసులు దృష్టి పెట్టాలని చెప్పారు. పిఠాపురంలో ఈవ్ టీజింగ్ అనేది తనకు కనిపించకూడదని అన్నారు.

ప్రతి జిల్లాకు తాను వస్తానని, మొదట పిఠాపురం నుండి ప్రారంభిస్తానని పవన్ తెలిపారు. విప్లవకారుడు రాజకీయ నాయకుడైతే ఇలాగే ఉంటుందని చెప్పుకొచ్చారు. విప్లవకారుడు తుపాకీ పట్టుకోకుండా ఓటు నమ్ముకుంటే ఇలాగే ఉంటుందని అన్నారు. తనకు డబ్బు పైన ఆశ లేదని, పేరు అవసరం లేదని, కేవలం పనిచేయడం కోసం వచ్చానని తెలిపారు.

అందుకే తిరుమల ఘటనను వైసీపీ వాడుకుంటోంది: పంచుమర్తి అనురాధ