Gossip Garage : తెలంగాణ మంత్రులు అలిగారా? తమను చిన్నచూపు చూశారని అవమానంగా ఫీలవుతున్నారా?
మరి ఈ వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం ఎలా డీల్ చేస్తుంది? మంత్రులను ఎలా సముదాయిస్తారనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది..

Gossip Garage : తెలంగాణ మంత్రులు అలిగారా..? తమను చిన్నచూపు చూశారని ఫీలవుతున్నారా..? అసలు పీఏసీ మీటింగ్ వేళ ఏం జరిగింది.? అసలు కాంగ్రెస్ పెద్దలు వాళ్లను ఎందుకు పట్టించుకోలేదు.. వాళ్లను వద్దనుకున్నారా.. వాళ్ల అవసరం లేదనుకున్నారా.. అసలు తెలంగాణ కాంగ్రెస్‌లో ఏం జరుగుతుంది?
మర్యాద కరువైతే మనసు చివుక్కుమంటుంది. పదవులు కట్టబెట్టినా.. పవర్ ఇచ్చినా.. మర్యాద తక్కువైతే.. మనసు తట్టుకోలేదు. తెలంగాణ మంత్రులకు ఇప్పుడలాంటి కష్టమే వచ్చింది.. అదేంటి అసలే మంత్రులు.. ఎక్కడికెళ్లినా మర్యాద టన్నుల కొద్దీ ఉంటుంది. అలాంటి వాళ్లు ఎందుకు ఫీలయ్యారనే డౌట్ పొలిటికల్ సర్కిళ్లలో బిగ్ డిబేట్ పాయింట్‌గా మారింది.
పీఏసీ సభ్యులకు మాత్రమే ఆహ్వానం..
తెలంగాణలో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారి పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సమావేశమైంది. ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ సమక్షంలో, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ ఆధ్వర్యంలో ఆ సమావేశం జరిగింది. అదే ఇప్పుడు తెలంగాణ మంత్రుల అలకకు కారణమైందట. ఈ సమావేశం జరుగుతుందని తెలిసినప్పటి నుంచి ఏం విషయాలు మాట్లాడాలో, ఏయే అంశాలను ప్రస్తావించాలో పెద్ద హోంవర్క్ చేశారట మంత్రులు.
కానీ కాంగ్రెస్ పెద్దలు సమావేశానికి పీఏసీ సభ్యులను మాత్రమే ఆహ్వానించి మంత్రులకు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు.. దీంతో ఇన్విటేషన్ లేని మంత్రులు అవమానంగా ఫీలవుతున్నారనేది గాంధీభవన్‌లో వినిపిస్తున్న గాసిప్..
Also Read : వైసీపీని వెంటాడుతున్న కొత్త సమస్య..! ఆ నియోజకవర్గం జగన్‌కు తలనొప్పిగా మారిందా..?
ఆహ్వానం అందకపోవడంతో ఆగ్రహంగా ఉన్న మంత్రులు..!
మొదటి నుంచి పీఏసీ మీటింగ్ అని చెప్పుకొచ్చారు. పీఏసీ సభ్యులను ఎలాగూ ఆహ్వానిస్తారు. ఇక మంత్రులను కూడా పిలుస్తారని ఊహించుకున్నారు. కానీ వారి ఆశలు అడియాశలు అవ్వడంతో ఆ మంత్రులంతా గుర్రుగా ఉన్నారట. ఇంతకీ పీఏసీ సమావేశానికి మంత్రులెందుకు అంత ఆసక్తి కనబరిచారనేది బహిరంగ చర్చగా మారింది.
కనీసం గౌరవప్రదంగానైనా పిలుపు లేదని నారాజ్..!
ఏఐసీసీ సంస్థాగత జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ పీఏసీ మీటింగ్‌కు హాజరవుతున్నారని తెలిసి మంత్రులంతా ఇంట్రెస్ట్ చూపించారు. కానీ నాలుగేళ్ల కింద నియమించిన 23 మంది పీఏసీ సభ్యులకు మాత్రమే ఆహ్వానాలు అందాయని టాక్.. దీంతో అసంతృప్తికి గురైన సదరు మంత్రులు పార్టీ ముఖ్య నేతలకు ఫోన్లు కొట్టి తమ అసంతృప్తిని తెలియజేస్తున్నారనేది టాక్. నాలుగేళ్ల కింద వేసిన కమిటీని అప్‌డేట్ చేయలేదు, కనీసం కేసీ వచ్చిన సందర్భంగానైనా గౌరవప్రదంగా పిలుపు లేదని నారాజ్ అయ్యారంట.. పార్టీ, ప్రభుత్వానికి సంబంధించిన అంశాలపై చర్చలో తమ భాగస్వామ్యం అవసరం లేదా అని ప్రశ్నించారట..
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్న నేపథ్యంలో పలు సూచనలు ఇవ్వాలని భావించారట మంత్రులు.. కానీ కీలకమైన సమావేశానికి ఆహ్వానించకుండా అవమానించారని రగిలిపోతున్నారని టాక్.. మరి ఈ వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం ఎలా డీల్ చేస్తుంది? మంత్రులను ఎలా సముదాయిస్తారనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది..
Also Read : కేటీఆర్ అరెస్ట్ ఖాయమా? 6 గంటల విచారణలో ఏసీబీ ఏం తేల్చింది?