Mohammed Fareeduddin : గుండెపోటుతో మాజీ మంత్రి కన్నుమూత, సీఎం కేసీఆర్ సంతాపం

టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఫరీదుద్దీన్‌ (64) గుండెపోటుతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన..

Mohammed Fareeduddin : టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఫరీదుద్దీన్‌ (64) గుండెపోటుతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సంగారెడ్డి వారం కిందటే ఆయనకు లివర్ సర్జరీ జరిగింది. ఈ క్రమంలో గుండెపోటు రావడంతో మృతి చెందారు. ఫరీదుద్దీన్ మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఫరీదుద్దీన్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మైనారిటీ నేతగా, ప్రజాప్రతినిధిగా ఆయన చేసిన సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు.

iPhones SIM slot : 2022లో సిమ్ కార్డు స్లాట్ లేకుండానే ఐఫోన్ మోడల్స్.. కాల్స్ చేసుకునేదెలా?

ఫరీదుద్దీన్‌ జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఏపీలో 2004లోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా సేవలందించారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. సొంతగ్రామం హోతి (బి) గ్రామ సర్పంచ్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.

Mark Zuckerberg: వ్యవసాయంలోకి మార్క్ జూకర్‌బర్గ్, రూ.127కోట్లతో స్థలం కొనుగోలు

1999లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి మైనారిటీ సంక్షేమ శాఖ, సహకార శాఖ మంత్రిగా వైఎస్‌ ప్రభుత్వంలో పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆ తర్వాత 2016లో టీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఫరీదుద్దీన్ మృతి పట్ల టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు సంతాపం తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు