Tamilisai Soundararajan: ‘రాజీనామా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ’ ప్రచారంపై గవర్నర్ తమిళిసై స్పందన
తమ అధిష్ఠానం ఏ బాధ్యత అప్పగించినా తాను అంగీకరిస్తానని తమిళిసై తెలిపారు. ఎంపీగా పోటీ చేస్తానని తాను ఎటువంటి..

Tamilisai Soundararajan
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేస్తారని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై తమిళిసై సౌందరరాజన్ స్వయంగా స్పందిస్తూ ఈ ప్రచారాన్ని కొట్టిపారేశారు.
అయోధ్య రామాలయ నిర్మాణంలో భాగస్వామ్యమైన హైదరాబాద్, బోయిన్ పల్లిలోని అనురాధ టింబర్ డిపోను తమిళిసై సందర్శించారు. రామ మందిర తలుపులను తయారు చేసిన అనురాధ టింబర్ డిపో ప్రతినిధిలతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియాతోనూ ఆమె మాట్లాడుతూ… తన రాజీనామాపై వస్తున్న వార్తలు అన్నీ ఊహాగానాలు మాత్రమేనని చెప్పారు.
తమ అధిష్ఠానం ఏ బాధ్యత అప్పగించినా తాను అంగీకరిస్తానని తమిళిసై తెలిపారు. ఎంపీగా పోటీ చేస్తానని తాను ఎటువంటి విజ్ఞప్తి చెయ్యలేదని చెప్పారు. తాను ఎప్పుడూ ప్రజలతోనే ఉంటానని తెలిపారు. వైద్యురాలిగా, రాజకీయ నాయకురాలిగా, గవర్నర్‌గా.. ఏ పదవిలో ఉన్నా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేసింది.
అయోధ్య రామ్ మందిర్‌లో అనురాధ టింబర్స్ ఒక పాలుపంచుకోవడం ఎంతో గర్వకారణమని తమిళిసై తెలిపారు. ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకుని స్వయంగా ఇక్కడకు వచ్చానని చెప్పారు.
MLC Kavitha : 22 కార్లు విజయవాడలో దాచారన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కవిత రియాక్షన్..