Fastag Yearly Pass: కొత్త ఫాస్టాగ్ పాస్.. హైదరాబాద్ టు విజయవాడ వెళ్లి రావాలంటే ఎంత ఖర్చవుతుంది..? వారికి మస్త్ బెనిఫిట్..
కేంద్ర ప్రభుత్వం తాజాగా అమల్లోకి తీసుకొచ్చిన వార్షిక ఫాస్టాగ్ పాస్ వల్ల జాతీయ రహదారులపై ఎక్కువగా ప్రయాణాలు సాగించే వారికి..

Toll Plazas
FASTag annual toll pass: జాతీయ రహదారులు, జాతీయ ఎక్స్‌ప్రెస్‌వేలపై ప్రయాణించే వాణిజ్యేతర ప్రైవేట్ వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వీరికోసం ఆగస్టు 15 నుంచి రూ.3వేలతో వార్షిక ఫాస్టాగ్ టోల్ పాస్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ వార్షిక టోల్ పాస్ తీసుకోవటం ద్వారా ఏడాదిపాటు లేదా 200 ట్రిప్పులు వరకు జాతీయ రహదారులపై ప్రయాణం చేయొచ్చు. ఒకవేళ ఉదాహరణకు ఆరు నెలల్లోనే 200 ట్రిప్పులు పూర్తయితే.. మళ్లీ కొత్తగా వార్షిక ఫాస్టాగ్ పాస్‌ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు.. పాత ఫాస్టాగ్ పాస్‌నే యాక్టివేట్ చేసుకోవచ్చు.
హైదరాబాద్ టూ విజయవాడకు..
వార్షిక ఫాస్టాగ్ పాస్ దేశవ్యాప్తంగా పనిచేస్తుంది. ఒక్కో టోల్ గేట్‌ను ఒక్కో ట్రిప్పుగా లెక్కిస్తారు. ఉదాహరణకు.. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లేవారు మూడు టోల్ గేట్లను దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది. కారులో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తే టోల్ ఛార్జి సుమారు రూ.335 వరకు పడుతుంది. రానుపోను టోల్ ఖర్చు రూ.670 అవుతుంది. రూ.3వేలు ఖర్చు పెట్టి వార్షిక ఫాస్టాగ్ తీసుకుంటే.. ఒక్కసారి హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లి రావటానికి ఆరు నుంచి ఎనిమిది టోల్ ట్రిప్పులు అవుతాయి.
వారికి మస్త్ బెనిఫిట్..
కేంద్ర ప్రభుత్వం తాజాగా అమల్లోకి తీసుకొచ్చిన వార్షిక ఫాస్టాగ్ వల్ల జాతీయ రహదారిపై ఎక్కువగా ప్రయాణాలు సాగించే వారికి ఉపయోగకరంగా ఉంటుంది. ఉదాహరణకు హైదరాబాద్, విజయవాడ రూట్లలో నిత్యం ప్రయాణం చేసే వాహనదారులకు ఈ కొత్త పాస్టాగ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ఎలా అంటే.. హైదరాబాద్ నుంచి విజయవాడకు కారులో పోయివస్తే సుమారు రూ.670 టోల్ ఛార్జీ అవుతుంది. అలా పదిసార్లు హైదరాబాద్ నుంచి విజయవాడకు పోయివస్తే టోల్ ఖర్చు రూ.6వేలకుపైగా అవుతుంది. అదే.. వార్షిక ఫాస్టాగ్ పాస్ ఒక్కసారి తీసుకుంటే రూ.3వేలు అవుతుంది. అయితే, హైదరాబాద్ నుంచి విజయవాడకు 24సార్లు వెళ్లి రావొచ్చు. అంటే.. మామూలు ఫాస్టాగ్ అయితే 24సార్లు హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై కారులో పోయిరావాలంటే రూ. 12వేలకు పైగానే టోల్ చార్జీలు ఖర్చు అవుతుంది. అదే.. ఒక్కసారి రూ.3వేలు చెల్లించి వార్షిక ఫాస్టాగ్ పాస్ తీసుకుంటే 24సార్లు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లిరావొచ్చు. అంటే.. ఎక్కువగా జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు ఈ వార్షిక ఫాస్టాగ్ పాస్ ఎంతో ఉఫయోగకరంగా ఉంటుంది.