FCI Explanation : తెలంగాణలో బియ్యం కొనుగోళ్లపై ఎఫ్ సీఐ వివరణ

తెలంగాణలో బియ్యం కొనుగోళ్లపై కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వినియోగదారుల వ్యవహారాల శాఖ వివరణ ఇచ్చింది. తెలంగాణలో గడిచిన ఐదారేళ్లుగా.. బియ్యం కొనుగోళ్లపై కేంద్రం గణాంకాలు వెల్లడించింది.

rice purchases in Telangana : తెలంగాణలో బియ్యం కొనుగోళ్లపై కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వినియోగదారుల వ్యవహారాల శాఖ వివరణ ఇచ్చింది. తెలంగాణలో గడిచిన ఐదారేళ్లుగా.. బియ్యం కొనుగోళ్లపై కేంద్రం గణాంకాలు వెల్లడించింది. ఖరీఫ్ సీజన్ బియ్యం కొనుగోలు పెంచాలని తెలంగాణ ప్రభుత్వం కోరిందని.. ఆ అభ్యర్థనను కేంద్రం పరిశీలిస్తోందని తెలిపింది.

తెలంగాణ ముఖ్యమంత్రి సెప్టెంబర్ 16న ప్రభుత్వ ఆహారం, పౌర సరఫరాల కార్యదర్శికి వరి బియ్యం కొనుగోళ్ళను పెంచాలని లేఖ రాశారని ప్రకటించింది. 90 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణ చేయాలని కోరారని, తెలంగాణకు చెందిన సాగునీటి ప్రాజెక్టుల సంఖ్యను పూర్తి కావడంతో సాగునీటిని సరఫరా 66.89 లక్షల ఎకరాలకు పెరిగిందని.. దీంతో వరి సాగు పెరిగిందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపినట్టుగా కేంద్రం లేఖలో తెలిపింది.

Heavy Rain Tirumala : తిరుమల డిజాస్టర్‌ రికవరీ సెంటర్‌లోకి వర్షపు నీరు..పూర్తిగా ఆగిపోయిన టీటీడీ సర్వర్లు, నెట్‌వర్క్‌

2014-15లో వరి ఉత్పత్తి 68.17 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్న ఉత్పత్తి 2020-21లో 259.20 లక్షల మెట్రిక్ టన్నులకి పెరిగిందని తెలిపింది. 145 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుందని అంచనా ఉంటే 90 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం వస్తుందని తెలిపారు. 2021-22కి 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం నుంచి 90 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొనుగోలు చేయాలని రాష్ట్రం కోరుతుందని తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు