Minister Harish Rao : వైద్య,ఆరోగ్య శాఖలో భర్తీలను త్వరలో భర్తీ చేస్తాం-హరీష్ రావు

వైద్య ఆరోగ్య శాఖలో భర్తీలను త్వరలో భర్తీ చేస్తామని  ఆ శాఖమంత్రి హరీష్ రావు చెప్పారు. ఈరోజు ఆయన మంత్రులు మహమ్మద్ అలీ, తలసాని శ్రీనివాస యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ తో కలిసి...

Minister Harish Rao :  వైద్య ఆరోగ్య శాఖలో భర్తీలను త్వరలో భర్తీ చేస్తామని  ఆ శాఖమంత్రి హరీష్ రావు చెప్పారు. ఈరోజు ఆయన మంత్రులు మహమ్మద్ అలీ, తలసాని శ్రీనివాస యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ తో కలిసి హైదరాబాద్ ఖైరతాబాద్ వెల్ నెస్ సెంటర్లో ఏర్పాటు చేసిన 50 పడకల ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు 12 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలకు వ్యాక్సిన్  వేసే  ప్రక్రియను ప్రారంభించారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ…ఇవాళ నేషనల్ వాక్సినేషన్ డే జరుపుకుంటున్నామని ఇందులో భాగంగా రాష్ట్రంలో 12నుండి 14 ఏళ్ల వయస్సు వారికి వ్యాక్సిన్ వేస్తున్నట్లు చెప్పారు. కోవిడ్ ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గలేదని..చైనా,అమెరికా, హాంగ్‌కాంగ్‌లో కొత్త కేసులు వస్తున్నాయని చెప్పారు.

ప్రతి ఒక్కరూ కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ..వాకిన్స్ వేయించుకోవాలని ఆయన సూచించారు. ప్రపంచంలో తయారైన వ్యాక్సిన్లలో రెండు హైదరాబాద్ నుండే తయారయ్యాయని ఆయన తెలిపారు. ఇప్పుడు 12-14 ఏళ్ల పిల్లలకు వేస్తున్న కొర్బోవాక్స్ కూడా ఇక్కడే తయారయ్యిందని మంత్రి చెబుతూ …వందకు వంద శాతం వ్యాక్సిన్ ప్రకియ రాష్ట్రంలో కొనసాగుతోందని అన్నారు.
Also Read : Covid Vaccine : వ్యాక్సిన్ వేయించుకోవటంలో నిర్లక్ష్యం వద్దు : డీహెచ్ శ్రీనివాస‌రావు
అన్ని హెల్త్ సెంటర్ లలో బయోలాజికల్ ఇవాన్స్ తయారు చేసిన వ్యాక్సిన్ 12 నుండి 14 ఏళ్ల వయస్సు వారికి వేయించాలని సూచించారు. 60 ఏళ్ళు దాటిన వారు బూస్టర్ డోస్ వేయించుకోవాలని హరీష్ రావు  కోరారు. రెండు డోస్ లు వ్యాక్సిన్ వేయించుకున్న వారు మాత్రమే థర్డ్ వేవ్ లో కరోనా బారిన పడలేదని వ్యాక్సిన్  వేయించుకోని వారు ఇబ్బందులు పడ్డారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఆశా వర్కర్ల జీతాలు పెద్ద మొత్తం లో పెంచిన ఘనత సీఎం  కేసీఆర్ దే అని మంత్రి హరీష్ రావు చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు