Amrutha Pranay: ప్రణయ్ హత్య కేసులో తీర్పుపై ఉత్కంఠ
నల్గొండ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ కొనసాగింది.

తెలంగాణలో 2018 సెప్టెంబర్‌లో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులో సోమవారం తీర్పురానుంది. తన కూతురు అమృత కులాంతర వివాహం చేసుకుందన్న పగతో మారుతీ రావు అనే వ్యక్తి సుఫారీ గ్యాంగ్‌తో ఆమె భర్త ప్రణయ్‌ని హత్య చేయించిన ఆరోపణలపై కేసు కొనసాగింది.
ఈ కేసులో మొత్తం మారుతీ రావు సహా ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత తీవ్ర ఒత్తిడిలో మారుతీ రావు బలవన్మరణానికి పాల్పడ్డారు. కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Also Read: పసిడి కొంటున్నారా? ధరలు పెరుగుతుండడంతో మీ కోసం బంగారం వ్యాపారులు ఏం చేస్తున్నారో తెలుసా?
కాగా, ప్రణయ్‌ది నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ. అతడు అమృత అనే యువతిని కులాంతర వివాహం చేసుకోవడంతో ఈ పెళ్లి ఆమె తండ్రికి నచ్చలేదు. ప్రణయ్‌ను 2018, సెప్టెంబర్ 14న హత్య చేయించారు. దీంతో ప్రణయ్ తండ్రి బాలస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎనిమిది మంది నిందితులను పోలీసులు న్యాయస్థానంలో హజరుపరిచారు. నల్గొండ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ కొనసాగింది. ఇటీవలే ప్రాసిక్యూషన్‌తో పాటు డిఫెన్స్ లాయర్ల వాదనలు విన్న కోర్టు మార్చి 10న తుది తీర్పు వెలువరిస్తామని చెప్పింది.