హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు.. సీఎం రేవంత్ ఏమన్నారంటే..

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు.. సీఎం రేవంత్ ఏమన్నారంటే..

ముస్లిం మహిళలను ప్రశ్నిస్తున్న మాధవీలత (Photo: @ANI)

Updated On : May 13, 2024 / 2:07 PM IST

Madhavi Latha: హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ ఆదేశాల మేరకు ఆమెపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలింగ్ కేంద్రంలో ముస్లిం మహిళలను అవమానించారని ఎన్నికల సంఘానికి ఎంఐఎం ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు చర్య తీసుకున్నారు. పాతబస్తీలో ఓ పోలింగ్ కేంద్రంలో పరిశీలనకు వెళ్లిన మాధవీలత.. ఓటర్ ఐటీ చెక్ చేస్తూ ముస్లిం మహిళలను బుర్కా తొలగించాలని ఒత్తిడి చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెపై విమర్శలు వస్తున్నాయి.

తనిఖీ చేసే హక్కు నాకుంది: మాధవీలత
ఈ వివాదంపై బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. “నేను అభ్యర్థిని. చట్ట ప్రకారం ముఖానికి మాస్క్‌లు లేకుండా ఓటర్ ID కార్డులను తనిఖీ చేసే హక్కు అభ్యర్థికి ఉంది. నేను పురుషుడిని కాదు, స్త్రీని. కాబట్టే చాలా వినయపూర్వకంగా నేను వారిని అభ్యర్థించాను. ఎవరైనా దీన్ని పెద్ద సమస్యను చేయాలనుకుంటే వారు భయపడున్నారని అర్థమవుతోంద”ని అన్నారు.

Also Read: నేను జాతీయ వాదిని.. మోదీ గెలుస్తారో, లేదో తెలియదు: అసదుద్దీన్ ఒవైసీ

మాధవీలత వీడియోపై స్పందించిన సీఎం రేవంత్
బీజేపీ అభ్యర్థి మాధవీలత ఓటర్ల గుర్తింపు కార్డులను తనిఖీ చేస్తున్న వీడియో గురించి మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. “నేను ఆ వీడియో చూడలేదు. ముస్లిం ఓట్లను పోలరైజ్ చేయడానికి ప్రయత్నిస్తోంది బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇలాంటివన్నీ అసదుద్దీన్‌ ఒవైసీ విజయానికి దోహదపడతాయి. దాని వల్ల బీజేపీకి ఎలాంటి ప్రయోజనం ఉండద”ని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.