brs mla pilot rohit reddy
BRS MLA Pilot Rohith Reddy : వికారాబాద్ లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నిర్వహిస్తున్న అతిరుద్ర మహా యాగంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 13 రోజులుగా రోహిత్ రెడ్డి దంపతులు రుద్రమహాయాగం నిర్వహిస్తున్నారు. గురువారం (జులై 13,2023) చివరి రోజు. ఈ రోజుతో యాగం పూర్తి అయ్యింది. ఈ క్రమంలో యాగం నిర్వహించే ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
యాగం చివరి రోజు పూర్ణాహుతిలో ప్రధాన యాగశాలలో అగ్నిప్రమాదం చోటు చేసుకోగా టెంట్స్ అన్నీ కాలిబూడిద అయ్యారు.అతిరుద్ర మహా యాగం మండపంతో పాటు మొత్తం అగ్నికి ఆహుతి అయ్యింది. ప్రధాన యాగం దగ్గర నిప్పురవ్వలు ఎగిరి పడడంతో అవికాస్తా గాలికి టెంట్ కు వ్యాపించాయి. అలా నిప్పురవ్వలు మంటలుగా మారి మొత్తం యాగశాలను కాల్చి బూడిద చేశాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చే సయమానికి అంతాకాలిపోయినట్లుగా తెలుస్తోంది. అప్పటికి ఇంకా రగులుతున్న కొద్దిపాటి మంటలను ఫైర్ సిబ్బంది ఆర్పివేశారు.
కాగా ఈ యాగం సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి భద్రతా సిబ్బందితో రీల్స్ చేసి వివాదంలో చిక్కుకున్నారు. మెుయినాబాద్ ఫాంహౌస్ కేసులో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విమర్శలు ఎదుర్కొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఓవరాక్షన్ తో మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.