కిడ్నాప్ అయిన బాలుడు గౌతమ్ సేఫ్

kidnapped Suryapet boy Gowtham safe : సూర్యాపేటలో కిడ్నాప్ అయిన ఐదేళ్ల బాలుడు గౌతమ్ కథ సుఖాంతమైంది. కిడ్నాప్ అయిన 24 గంటల్లోనే బాలుడు క్షేమంగా తిరిగొచ్చాడు. అయితే అతడిని ఎవరు కిడ్నాప్ చేశారన్నదే తేలలేదు.
బాలుడిని కిడ్నాపర్స్ వదిలిపెట్టారా.. లేక పోలీసులే ఆచూకీ కనిపెట్టారా అన్నదానిపైనా స్పష్టత లేదు. ఇవాళ పోలీసులు ఈ కేసులో నెలకొన్న సందేహాలపై పెదవి విప్పే అవకాశముంది.
సూర్యాపేటలో దీపావళి రోజున కిడ్నాప్‌కు గురైన బాలుడు గౌతమ్ సేఫ్‌గా తిరిగొచ్చాడు. పోలీసులు బాలుడిని అతడి తండ్రికి సురక్షితంగా అప్పగించారు. ఒకరోజులోనే గౌతమ్ కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు.
దీంతో 24 గంటలు కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని భగత్‌సింగ్ నగర్‌లో గౌతమ్ శనివారం రాత్రి అదృశ్యమయ్యాడు.
బాణసంచా కోసమని వెళ్లిన గౌతమ్ ఇంటికి తిరిగిరాలేదు. దీంతో బాలుడి తల్లిదండ్రులు కుమారుడి కోసం తెలిసిన చోటల్లా వెతికారు. బంధువులందరినీ ఆరా తీశారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా బాలుడి ఆచూకీ కనిపించలేదు. అయితే బాణసంచా షాపు సమీపంలో గౌతమ్ సైకిల్ లభ్యమైంది.
https://10tv.in/new-twist-in-suryapet-boy-missing-case/
ఎక్కడా గౌతమ్ ఆచూకీ లభించకపోవడంతో అతడి పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గౌతమ్ ఇంటి పక్కనే ఉండే ఓ టైలర్‌కు ఆదివారం ఉదయం ఆగంతకుల నుంచి ఫోన్ వచ్చింది. బాలుడు కర్నూలులో ఉన్నాడని చెప్పారు.
దీంతో పోలీసులు ఫోన్ కాల్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. చివరికి 24 గంటల్లోనే గౌతమ్ ఆచూకీని కనిపెట్టారు. అయితే బాలుడిని ఎవరు కిడ్నాప్ చేశారు, బాలుడు పోలీసులకు ఎక్కడ దొరికాడు, 24 గంటలు ఎక్కడున్నాడన్న సందేహాలపై పోలీసులు మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
ఇవాళ ప్రెస్‌మీట్ పెట్టి అన్ని విషయాలు చెబుతామని పోలీసులు చెబుతున్నారు. అయితే బాలుడి కిడ్నాప్‌పై అనేక అనేక సందేశాలు వ్యక్తమవుతున్నాయి.
బాలుడి కిడ్నాప్‌కు పాల్పడింది ఎవరు అన్నదానిపై ఇంత వరకు ఎలాంటి స్పష్టత లేదు. బాలుడి కిడ్నాప్ చేసిన తర్వాత కిడ్నాపర్స్ ఎక్కడికి తీసుకెళ్లారు, 24 గంటలు ఎక్కడ ఉంచారన్నదానిపై పోలీసులు పెదవి ఇప్పడం లేదు.
పోలీసులు బాలుడి ఆచూకీ ఎలా కనిపెట్టారు.. గౌతమ్ ఖాకీలు ఎక్కడ దొరికాడన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. కిడ్నాపర్స్ బాలుడిని వదిలేశారా.. లేక పోలీసులు కిడ్నాపర్స్‌ను కనిపెట్టి గౌతమ్‌ను సేఫ్ చేశారా అన్నది కూడా తెలియాల్సి ఉంది.
ఇంతకీ కిడ్నాపర్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారా లేదా.. ఇలాంటి ప్రశ్నలన్నింటికి పోలీసులు ఇవాళ సమాధానం చెప్పే అవకాశముంది. పోలీసుల ప్రెస్‌మీట్‌తో అన్ని సందేహాలకు సమాధానం లభించే అవకాశముంది.