అడవిలో గూగుల్ మ్యాప్ ను నమ్ముకొని దారి తప్పిన శివస్వాములు..

గూగుల్ మ్యాప్ ను పెట్టుకొని శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్తున్న శివస్వాములు అడవిలో తప్పిపోయారు.

shiva swamies

shiva swamies: ఏదైనా ప్రాంతానికి వెళ్లే సమయంలో దారితెలియని వారు గూగుల్ మ్యాప్ ను అనుసరిస్తూ ముందుకెళ్తుంటారు. తద్వారా షార్ట్ కట్ మార్గాలను, ట్రాఫిక్ తక్కువగా ఉన్నదారులను ఎంచుకుంటారు. అయితే, కొన్నిసార్లు గూగుల్ మ్యాప్ ను అనుసరిస్తూ వెళ్లిన వారు దారితప్పి అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి ఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. తాజాగా… గూగుల్ మ్యాప్ ను పెట్టుకొని శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్తున్న శివస్వాములు అడవిలో తప్పిపోయారు.

Also Read: SLBC Tunnel Collapse: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం.. కూలిన పైకప్పు.. టన్నెల్ లోపల చిక్కుకున్న కూలీలు..

శివస్వాములు పాదయాత్ర ద్వారా శ్రీశైలం బయలుదేరారు. గూగుల్ మ్యాప్ ను అనుసరిస్తూ ముందుకుసాగారు. అయితే, వెళ్లాల్సిన దారిలో కాకుండా మరో మార్గంలో వెళ్లడంతో వారు దారి తప్పిపోయారు. సాయంత్రానికి దారితప్పిన విషయాన్ని గుర్తించిన శివస్వాములు భయాందోళనకు గురయ్యారు. దీంతో సెల్ ఫోన్ ద్వారా 100 కు ఫోన్ చేశారు. నంద్యాల జిల్లా ఎస్పీ స్పందించి వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అధికారులను ఆదేశించారు. రంగంలోకి దిగిన అటవీశాఖ సిబ్బంది శివస్వాముల కోసం వెతుకులాట ప్రారంభించారు. చివరికి రాత్రి 8గంటల సమయంలో వారిని గుర్తించి సురక్షితంగా అటవీ ప్రాంతంలో నుంచి బయటకు తీసుకొచ్చారు.

Also Read: Odela 2 Teaser : కుంభ‌మేళాలో ‘ఓదెల 2’ టీజ‌ర్ రిలీజ్‌.. లేడీ అఘోరాగా త‌మ‌న్నా..

కొల్లాపూర్ నియోజకవర్గం పెంటవెల్లి గ్రామానికి చెందిన మనోజ్, గురుప్రసాద్, రాజు, గోపాల్ తోపాటు ఏడుగురు శివస్వాములు శుక్రవారం ఉదయం శ్రీశైలానికి పాదయాత్రగా బయలుదేరారు. గూగుల్ మ్యాప్ ను అనుసరిస్తూ ఇంద్రేశ్వరం బీట్ మీదుగా నడుచుకుంటూ అడవిలో పాకశాల ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఎటు వెళ్లాలో తెలియక దారితప్పారు. శుక్రవారం సాయంత్రం 4గంటల సమయంలో దారితప్పినట్లు గుర్తించారు. దీంతో సెల్ ఫోన్ ద్వారా 100 కు ఫోన్ చేశారు. నంద్యాల జిల్లా ఎస్పీ స్పందించి అడవిలో తప్పిపోయిన శివస్వాములను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆత్మకూరు అటవీశాఖ అధికారులు రంగంలోకిదిగి శివస్వాముల ఆచూకీకోసం వెతుకులాట ప్రారంభించారు.

 

రేంజర్ కృష్ణప్రసాద్ పర్యవేక్షణలో ఎఫ్ఎస్వో ముగ్బుల్, ఎఫ్బీవో మద్దిలేటి ఆధ్వర్యంలో రెస్క్యూ బృందం జీపీఎస్ ఆధారంగా నల్లమల అడవిలో శివస్వాముల కోసం వెతుకులాట ప్రారంభించారు. సుమారు ఐదారు గంటల పాటు వెతుకులాట అనంతరం ఫారెస్ట్ అధికారులు శివస్వాముల ఆచూకీని గుర్తించారు. వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. అటవీ శాఖ అధికారులు చూపించిన మార్గంలోనే భక్తులు పాదయాత్రగా శ్రీశైలం చేరుకోవాలని ఫారెస్ట్ అధికారులు విజ్ఞప్తి చేశారు.