కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ ఎదుట కేసీఆర్ వన్ టు వన్ విచారణ..

కేసీఆర్ వెంట బీఆర్ఎస్‌ నేతలు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సంతోష్ కుమార్ సహా పలువురు ఉన్నారు.

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ విచారణకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. మొదట ఓపెన్ కోర్టులో కేసీఆర్ ను విచారిస్తారని భావించారు. అందుకు తగినట్టు బీఆర్కే భవన్ లో తగినట్టు ఏర్పాట్లు చేశారు. ఓపెన్ కోర్టులో కేసీఆర్ ఏం చెబుతారా అని చాలా మంది బీఆర్ఎస్ నేతలు, న్యాయవాదులు, జర్నలిస్టులు ఓపెన్ కోర్టులో కూర్చున్నారు.

కానీ, కేసీఆర్ హాజరైన తర్వాత జస్టిస్ పీసీ ఘోష్ తో సమావేశమయ్యారు. తనకు ఓపెన్ కోర్టు కంటే కూడా ఇన్ కెమెరా విచారణ కంఫర్టబుల్ గా ఉంటుందని చెప్పినట్టు తెలిసింది. తన అనారోగ్య కారణంగా కేసీఆర్ ఈ రిక్వెస్ట్ పెట్టినట్టు తెలిసింది. కేసీఆర్ రిక్వెస్ట్ ను పరిగణనలోకి తీసుకుని ఇన్ కెమెరా విచారణకు జస్టిస్ ఘోష్ అంగీకరించారు. అది కూడా కెమెరా కాకుండా కేవలం వన్ టు వన్ విచారణ జరుగుతున్నట్టు సమాచారం.

అంతకు ముందు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కీలక డాక్యుమెంట్స్‌ పట్టుకుని కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. లోపలికి వెళ్లేందుకు కేసీఆర్‌తో పాటు 9 మంది నేతలకు అనుమతి ఇచ్చారు. కేసీఆర్ వెంట బీఆర్ఎస్‌ నేతలు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, మధుసూదనాచారి, ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్, రవిచంద్ర, పద్మారావు, లక్ష్మారెడ్డి, మహమూద్ అలీ, తదితరులు ఉన్నారు.

కేసీఆర్‌ను జస్టిస్‌ పీసీ ఘోష్‌ ప్రశ్నిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రీ ఇంజినీరింగ్‌తో పాటు ఆనకట్టల నిర్మాణం, ఒప్పందాల వంటి అంశాలపై కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 114 మందిని జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ విచారించింది.

Also Read: గాలి జనార్దన్ రెడ్డికి హైకోర్టులో ఊరట.. సీబీఐ కోర్టు విధించిన జైలు శిక్షపై స్టే

ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ… దేశ వ్యాప్తంగా ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు. కాళేశ్వరం అంశంపై ఆ రెండు పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయన తెలిపారు.

బీఆర్ఎస్‌, కేసీఆర్ ఎటువంటి తప్పు చేయలేదని చెప్పారు. కాళేశ్వరంలాంటి ప్రాజెక్టును ప్రపంచంలో ఎక్కడ కట్టినా పురస్కారాలు దక్కుతాయని తెలిపారు. ఆ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెసే ఏదో చేసి ఉంటుందని ఆరోపించారు. మేడిగడ్డలో కాంగ్రెస్‌ వాళ్లే కుట్ర చేసి ఉంటారని చెప్పారు.