గాలి జనార్దన్ రెడ్డికి హైకోర్టులో ఊరట.. సీబీఐ కోర్టు విధించిన జైలు శిక్షపై స్టే
దేశం విడిచి ఎక్కడికి వెళ్లిపోవడానికి వీలు లేదని చెప్పింది.

ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో దోషి గాలి జనార్దన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కింది. గాలి జనార్దన్‌రెడ్డితో పాటు ఆయన పీఏ అలీఖాన్, బీవీ శ్రీనివాస్‌రెడ్డి, రాజగోపాల్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నలుగురికి ఇటీవల నాంపల్లిలోని సీబీఐ కోర్టు విధించిన ఏడేళ్ల జైలు శిక్షపై స్టే విధించింది. రూ.10 లక్షల రెండు షూరిటీలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.
దేశం విడిచి ఎక్కడికి వెళ్లిపోవడానికి వీలు లేదని చెప్పింది. పాస్ పోర్ట్ సరెండర్ చేయాలని హైకోర్టు ఆశించింది. ఎలాంటి క్రిమినల్ చర్యల్లో పాల్గొనకూడదని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కాగా, 15 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో న్యాయమూర్తి టి.రఘురాం గత నెల తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.