Free Haleem : ఫ్రీ హలీమ్ కోసం ఎగబడ్డ జనం.. లాఠీలకు పనిచెప్పిన పోలీసులు.. వీడియో వైరల్

రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముసరాంబాగ్ లోని హజీబో హోటల్ యాజమాన్యం ఫ్రీ హలీమ్ ఇస్తున్నామంటూ సోషల్ మీడియాలో ప్రకటన ఇచ్చింది.

Free Haleem

Hyderabad Musarambagh : రంజాన్ మాసం వచ్చిందంటే చాలు.. భాగ్యనగరంలోని వీధివీధిన హలీమ్ దుకాణాలు వెలుస్తాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాస దీక్షచేసే ముస్లీం సోదరులతో పాటు ఇతర వర్గాల ప్రజలుసైతం హలీమ్ తినేందుకు పోటీ పడుతుంటారు. దీంతో రంజాన్ మాసం మొత్తం హలీమ్ దుకాణాలు సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు రద్దీగా కనిపిస్తాయి. ప్రస్తుతం రంజాన్ మాసం ప్రారంభమైంది. ముస్లీంలు ప్రత్యేక ప్రార్థనలతో పాటు ఉపవాస దీక్షలు ఉంటున్నారు. మరోవైపు భాగ్యనగరంలో వీధివీధి హలీమ్ దుకాణాలు వెలిశాయి. మలక్ పేట్ లోని ఓ హోటల్ యాజమాన్యం ఫ్రీ హలీమ్ ఇస్తున్నామని సోషల్ మీడియాలో ప్రకటన చేయడంతో.. భారీగా ప్రజలు తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతంలో తొపులాట చోటు చేసుకుంది.

Also Read : వాహనాల రిజిస్ట్రేషన్ మార్క్‌ను టీఎస్ నుంచి టీజీకి మార్చుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ

రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముసరాంబాగ్ లోని హజీబో హోటల్ యాజమాన్యం ఫ్రీ హలీమ్ ఇస్తున్నామంటూ సోషల్ మీడియాలో ప్రకటన ఇచ్చింది. ఇంకేముంది.. అసలే రంజాన్ మాసం ప్రారంభం.. ఇన్నాళ్లు హలీమ్ కోసం వేచిచూసిన నగర వాసులు భారీ సంఖ్యలో హజీబ్ హోటల్ వద్దకు చేరుకున్నారు. ఫ్రీ హలీమ్ కోసం ఒక్కసారిగా పోటీపడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో తోపులాట చోటు చేసుకుంది. దీనికితోడు హోటల్ ఎదుట రహదారి మొత్తం జనాలతో నిండిపోయింది. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో భారీగా వచ్చిన జనాలను కంట్రోల్ చేయలేకపోయిన హోటల్ యాజమాన్యం.. పోలీసులకు సమాచారం అందించింది.

Also Read : Saidireddy : రేవంత్ రెడ్డిని దింపాలని కాంగ్రెస్ వాళ్లే అనుకుంటున్నారు..! సైదిరెడ్డి టెలికాన్ఫరెన్స్ వాయిస్ రికార్డు వైరల్

పోలీసులు రంగంలోకిదిగి లాఠీలకు పనిచెప్పారు. రహదారిపై హోటల్ ముందు గుంపులుగా చేరిన వారిని చెదరగొట్టారు. దీంతో పరిస్థితి కంట్రోల్ లోకి వచ్చింది. హోటల్ యాజమాని ఆలోచన వల్ల పలువురికి లాఠీ దెబ్బలు తగిలాయి. మరోవైపు పోలీసుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. పబ్లిసిటీకోసం ఈ పరిస్థితికి కారణమైన హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. మాపై లాఠీచార్జీ చేయడం ఏమిటని పోలీసులను పలువురు ప్రశ్నించారు.

 

 

 

 

ట్రెండింగ్ వార్తలు