G Kishan Reddy : కిరణ్ కుమార్ రెడ్డి చేరిక బీజేపీపై ప్రభావం చూపదు-కిషన్ రెడ్డి

G Kishan Reddy : తెలంగాణను వ్యతిరేకించిన వారే కేసీఆర్ పక్కన ఉన్నారు. అసదుద్దీన్ ఒవైసీ, తలసాని తెలంగాణను వ్యతిరేకించారు.

G Kishan Reddy : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరిన విషయం విదితమే. పార్టీ హైకమాండ్ తనకు ఏ బాధ్యతలను అప్పగించినా స్వీకరించేందుకు తాను సిద్ధమని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. కాగా, రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన వ్యక్తిగా ముద్రపడిన కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. బీజేపీలో కిరణ్ కుమార్ రెడ్డి చేరికతో తెలంగాణ బీజేపీపై ఎలాంటి ప్రభావం చూపదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

Also Read..Rudraraju Gidugu: కిరణ్ కుమార్ రెడ్డి అసమర్థుడు.. వెన్నుపోటు పొడిచి పారిపోయాడు

ఒక బీజేపీ నేతగా బీజేపీ కార్యకర్తను కలిసేందుకు కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారని ఆయన చెప్పారు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ నేత అని గుర్తు చేశారు. తెలంగాణను వ్యతిరేకించిన వారే ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కన ఉన్నారని గుర్తు చేశారు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణను వ్యతిరేకించారని కిషన్ రెడ్డి అన్నారు.

అటు.. కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరడంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు కూడా స్పందించారు. కిరణ్ రాకతో ఏపీ, తెలంగాణలో బీజేపీ బలోపేతం అవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. నాలుగేళ్ల క్రితమే కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీలోకి రావాలని తాను, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానించామని సోమువీర్రాజు తెలిపారు.

Also Read..Pawan Kalyan : వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ బీజేపీ, జనసేన లక్ష్యం.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వం-పవన్ కల్యాణ్

కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరికపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల నాటికి ఏపీలో బీజేపీని బలోపేతం చేసే అంశం పై కిరణ్ కుమార్ రెడ్డి తో చర్చించానని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో కిరణ్ కుమార్ రెడ్డి సేవలు ఉపయోగించుకుంటామన్నారు.

ట్రెండింగ్ వార్తలు