Gachibowli Gang Rape Case : గచ్చిబౌలి యువతి గ్యాంగ్ రేప్ కేసులో ట్విస్టులు.. వెలుగులోకి గాయత్రి దురాగతాలు

సంచలనం రేపిన గచ్చిబౌలి యువతి గ్యాంగ్ రేప్ కేసులో అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో గాయత్రి పాల్పడిన దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

  • Published On : May 30, 2022 / 04:34 PM IST

gachibowli rape case

Gachibowli Gang Rape Case : రాష్ట్రంలో సంచలనం రేపిన హైదరాబాద్ గచ్చిబౌలి యువతి గ్యాంగ్ రేప్ కేసులో అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో గాయత్రి దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. యువతిని తీవ్రంగా వేధించిన గాయత్రి.. తన తల్లిని, అక్కను కూడా చిత్రహింసలకు గురి చేసినట్లు తెలుస్తోంది. రూమ్ లో బంధించడం, భోజనం ఇవ్వకపోవడం, దాడి చేయడం వంటి పనులు చేసిందని తెలుస్తోంది. ఈ రాక్షస క్రీడలో శ్రీకాంత్ కూడా భాగం అని గాయత్రి తల్లి కృష్ణవేణి ఆరోపించారు.

Hyderabad : గచ్చిబౌలి యువతి రేప్ కేసులో కొత్త ట్విస్ట్

గాయత్రి గురించి సంచలన విషయాలు చెప్పారు ఆమె తల్లి కృష్ణవేణి. తన కూతురు గాయత్రి ఓ సైకో అని తల్లి కృష్ణవేణి చెప్పింది. ఎదుటివారిని హింసించి పైశాచిక ఆనందం పొందడం గాయత్రికి అలవాటే అంటోంది. బయటి వాళ్లనే కాదు జన్మనిచ్చిన తనను కూడా చిత్రహింసలు పెట్టిందని వాపోయింది. గాయత్రికి గతంలోనే పెళ్లి అయిందని, అయితే భర్తను హింసించడంతో అతడు వదిలేశాడని తెలిపింది.(Gachibowli Gang Rape Case)

ఆ తర్వాత శ్రీకాంత్ ను తీసుకొచ్చి తనను మానసికంగా, శారీరకంగా హింసించిందని కన్నీటి పర్యంతమైంది. తన పెద్ద కుమార్తె పైనా గాయత్రి దాడికి పాల్పడిందని చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

Gachibowli Gang Rape Case

Gachibowli Rape Attempt : గచ్చిబౌలిలో దారుణం.. యువతిపై అత్యాచారయత్నం చేయించిన మహిళ.. న్యూడ్ వీడియోలు తీసి

మూడు పాత్రలు.. వాటి చుట్టూ అల్లుకున్న మరికొన్ని పాత్రలు.. వాళ్ల మధ్య వివాదాస్పద సంబంధాలు. ఒకరికి తెలియకుండా మరొకరు తెరవెనుక నడిపే నాటకాలు. ఒకరిపై మరొకరు పెంచుకున్న అనుమానాలు. ఒకరిని కట్టడిలో ఉంచుకోవడానికి మరొకరు పన్నిన వ్యూహాలు. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్.. ఏ క్రైమ్ సినిమాలోనూ కనిపించనన్ని మలుపులు. ఇదీ హైదరాబాద్ గచ్చిబౌలి యువతి గ్యాంగ్ రేప్ కేసు అనే క్రైమ్ కథలో కనిపించిన దృశ్యాలు. అసలు గాయత్రి ఇంతటి దారుణానికి ఎందుకు ఒడిగట్టింది? గాయత్రి తన భర్త అని చెప్పుకుంటున్న శ్రీకాంత్ ఎవరు? అతనికి బాధిత యువతికి సంబంధం ఏమిటి?

Loan App Harassment : న్యూడ్ ఫొటోలతో మహిళకు వేధింపులు.. లోన్ యాప్‌లతో జాగ్రత్త

బాధితురాలు.. గాయత్రి ఇంట్లో ఎందుకు ఉంది? ఈ ప్రశ్నల వెనుక పెద్ద కహానీయే ఉంది. తన భర్తతో సన్నిహితంగా ఉంటుందని, బాధితురాలిపై ఏకంగా నలుగురు యువకులతో గ్యాంగ్ రేప్ చేయించింది గాయత్రి. అయితే, ఆమె భర్త శ్రీకాంత్ డైరెక్షన్ లోనే ఈ క్రైమ్ కహానీ నడిచిందని గాయత్రి తల్లి కృష్ణవేణి ఆరోపిస్తోంది. గాయత్రి, శ్రీకాంత్ కలిసే ఈ దారుణానికి ఒడిగట్టారని అంటోంది తల్లి. అసలు గాయత్రి, శ్రీకాంత్ భార్య భర్తలే కాదంటూ మరో బాంబు కూడా పేల్చింది కృష్ణవేణి. బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడిన నలుగురు యువకులతో పాటు గాయత్రిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.

Rajasthan : బావిలో దూకి ఇద్దరు పిల్లలతోపాటు ముగ్గురు అక్కాచెల్లెళ్లు సూసైడ్‌..మహిళల్లో ఇద్దరు గర్భిణులు