Ganesh Immersion In Hyderabad : హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం..భాగ్యనగర్‌ ఉత్సవ సమితి వర్సెస్‌ తెలంగాణ సర్కార్‌

హైదరాబాద్‌లో వినాయకుడి నిమజ్జనం వ్యవహారం తెలంగాణ సర్కార్‌కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. హుస్సేన్‌సాగర్‌లో పీఓపీ విగ్రహాలకు నిమజ్జనం చేసేందుకు అనుమతి లేకపోవడంతో నిమజ్జనంపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. దీంతో భాగ్యనగర్‌ ఉత్సవ సమితి తెలంగాణ సర్కార్‌కు అల్టిమేటం ఇచ్చింది.

Ganesh Immersion in Hyderabad : హైదరాబాద్‌లో వినాయకుడి నిమజ్జనం వ్యవహారం తెలంగాణ సర్కార్‌కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. హుస్సేన్‌సాగర్‌లో పీఓపీ విగ్రహాలకు నిమజ్జనం చేసేందుకు అనుమతి లేకపోవడంతో నిమజ్జనంపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. దీంతో భాగ్యనగర్‌ ఉత్సవ సమితి తెలంగాణ సర్కార్‌కు అల్టిమేటం ఇచ్చింది. వినాయక నిమజ్జనంపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై భాగ్యనగర్‌ ఉత్సవ సమితి అధ్యక్షుడు భగవంత్‌రావు ఫైరయ్యారు. హుస్సేన్‌సాగర్‌లోనే నిమజ్జనం చేసి తీరుతామని భగవంత్‌రావు స్పష్టం చేశారు.

నిమజ్జనానికి సరైన ఏర్పాట్లు లేకుంటే ఎక్కడి విగ్రహాలు అక్కడే ఉంటాయని.. హిందూ పండుగలపై ప్రభుత్వం ఆంక్షలు సరికాదన్నారు భగవంత్‌రావు. క్రిస్‌మస్, రంజాన్‌కు లేని ఆంక్షలు గణేష్‌ ఉత్సవాలపై ఎందుకుని ప్రశ్నించారు.. భగవంత్‌రావు. వినాయక నవరాత్రి ఉత్సవాలపై ప్రభుత్వం కుటిలనీతి ప్రదర్శిస్తోందని.. నిమజ్జనంతో ఎలాంటి అపశృతి జరిగినా బాధ్యత సర్కార్‌దేనని భగవంత్‌రావు తేల్చి చెప్పారు. అటు హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనంపై మొదటి నుంచీ పర్యావరణవేత్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Minister Talasani Srinivas : ఈ నెల 9న గణేష్ నిమజ్జనాలు..ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు : మంత్రి తలసాని

గతేడాది నిమజ్జనానికి అనుమతిచ్చిన సుప్రీంకోర్టు.. ఇకపై హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనాలు వద్దంటూ ఆదేశాలిచ్చింది. ప్లాస్టర్‌ ఆఫ్ పారిస్‌ విగ్రహాలు పెట్టుకోవచ్చని సుప్రీం చెప్పగా.. నిమజ్జనం మాత్రం వద్దని చెప్పింది. దీంతో ఈ ఏడాది పీఓపీ విగ్రహాల నిమజ్జనం విషయంలో సస్పెన్స్‌ నెలకొంది. ప్రభుత్వం అక్కడక్కడా పాండ్స్‌ ఏర్పాటు చేశామని చెప్తున్నా.. ఇప్పటి వరకు ఉత్సవ సమితులకు అధికారిక సమాచారం ఇవ్వలేదని భాగ్యనగర్‌ ఉత్సవ సమితి అంటోంది.

గణేష్ విగ్రహాలను చెత్తలో పడేస్తున్నారని.. ఇదేం పద్ధతంటూ భగవంత్‌రావు నిలదీశారు. కొలనుల్లోనే నిమజ్జనం చేయాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని.. బాలాపూర్ గణేష్ సమితికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారని చెప్పారు. అలాంటి చర్యలు కరెక్ట్‌ కాదని.. ఇతర పండుగల మీద ఉన్న ఆసక్తి గణేష్ ఉత్సవాల‌పై ఎందుకు లేదని భగవంత్‌రావు ప్రశ్నించారు. 24 గంటల్లోనే నిమజ్జనం చేసిన వ్యర్థాలను తొలగిస్తున్నామని.. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గణేష్ నిమజ్జనం హుస్సేన్ సాగర్‌లోనే జరుగుతుందని.. రేపు ట్యాంక్‌బండ్‌పై బైక్ ర్యాలీ నిర్వహిస్తామని భగవంత్‌రావు అన్నారు.

ట్రెండింగ్ వార్తలు