Minister Talasani Srinivas : ఈ నెల 9న గణేష్ నిమజ్జనాలు..ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు : మంత్రి తలసాని

ఈనెల 9న గణేష్‌ నిమజ్జనాలు భారీగా జరుగుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఐదో తేదీనే ఏర్పాట్లు చేయడం లేదంటూ మాట్లాడటం సరికాదన్నారు. ఈనెల 9కి ఇంకా సమయం ఉందని ఆ టైమ్‌ వరకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయన్నారు. గణేశ్ నిమజ్జనానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. హైదరాబాద్‌ పరిధిలో 74 ప్రాంతాల్లో పాండ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు.

Minister Talasani Srinivas : ఈ నెల 9న గణేష్ నిమజ్జనాలు..ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు : మంత్రి తలసాని

Minister Talasani Srinivas

Minister Talasani Srinivas : ఈనెల 9న గణేష్‌ నిమజ్జనాలు భారీగా జరుగుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఐదో తేదీనే ఏర్పాట్లు చేయడం లేదంటూ మాట్లాడటం సరికాదన్నారు. ఈనెల 9కి ఇంకా సమయం ఉందని ఆ టైమ్‌ వరకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయన్నారు. గణేశ్ నిమజ్జనానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. హైదరాబాద్‌ పరిధిలో 74 ప్రాంతాల్లో పాండ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నిమజ్జనానికి ఏర్పాట్లు చేయడం లేదంటున్నారు..ఒక్కసారి ట్యాంక్‌బండ్‌పైకి వెళ్లి చూస్తే తెలుస్తుందన్నారు.

ప్రభుత్వం నిర్వహించకపోతే తాము నిర్వహిస్తామనడం సరికాదని మంత్రి తలసాని అన్నారు. ప్రభుత్వం ఏర్పాట్లు చేయకపోతే వాళ్లెలా ఏర్పాట్లు చేసుకుంటారని ప్రశ్నించారు. ఇంత మంది పోలీసులను, సిబ్బందిని ఎక్కడి నుంచి తీసుకొస్తారని ప్రశ్నించారు. ప్రతీది రాజకీయంగా మాట్లాడం బాధ్యతారాహిత్యమన్నారు. హిందువుల పండగలపై వివక్ష చూపుతున్నారనడం సరికాదన్నారు. తాము కూడా హిందువులమేనని తలసాని అన్నారు. తామే వినాయక విగ్రహాలను ఏర్పాటు చేస్తామన్నారు. విగ్రహాల ఎత్తు పెంచొద్దని తాము చెప్పలేదని స్పష్టం చేశారు.

Ganesha Mandal Insurance : వామ్మో.. దేశంలోనే ఖరీదైన ఈ గణపతి మండపానికి రూ.316 కోట్ల బీమా కవరేజ్

పండగలపై రాజకీయం చేయడం బాధాకరమని తలసాని అన్నారు. పండగలను ఎలా చేయాలో తమకు ఎవరైనా చెప్పాలా? అది తమ ప్రభుత్వం బాధ్యత అన్నారు. ఏ పండగ చేసినా గొప్పగా చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని గుర్తు చేశారు. హిందువులంటూ విడదీసి మాట్లాడటం సరికాదన్నారు. మీరు హిందువులైతే మరి మేం ఎవరం..? అని ప్రశ్నించారు. ఏ పండగ వచ్చినా ముందుగానే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.