Ganesh Laddu: మై హోం భూజా, బాలాపూర్ లడ్డూల వేలంలో రికార్డు ధర

మై హోమ్‌ భూజాలో గణపతి లడ్డూ వేలం రికార్డు సృష్టించింది. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న లడ్డూ వేలంలో రికార్డు ధర పలికింది.

Ganesh Laddu: మై హోం భూజా, బాలాపూర్ లడ్డూల వేలంలో రికార్డు ధర

Ganesh Laddu Auction In Myhome Bhooja And Balapur

Updated On : September 19, 2021 / 12:15 PM IST

Ganesh Laddu: మై హోమ్‌ భూజాలో గణపతి లడ్డూ వేలం రికార్డు సృష్టించింది. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న లడ్డూ వేలంలో రికార్డు ధర పలికింది. వేలంలో ఏకంగా పద్దెనిమిదిలక్షల యాభై వేల రూపాయలకు దక్కించుకున్నాడు ఓ భక్తుడు. మై హోమ్‌ భూజా వాసులు వేలంలో పోటాపోటీగా పాల్గొనడంతో ఉత్కంఠభరితంగా సాగింది. గణపతి నిమజ్జన శోభాయాత్రలోనూ.. మైహోమ్‌ భూజా వాసులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

అంచాలకు అతీతంగా వేలంలో రూ.18.5 లక్షల వరకూ పలికింది. ఈ సందర్భంగా మాట్లాడిన మైహోమ్ గ్రూప్ డైరక్టర్ జూపల్లి రాజిత.. ‘వేలంలో లడ్డూ రికార్డు ధర పలికిందని.. లడ్డూ ద్వారా వచ్చిన డబ్బులను సమాజహిత కార్యక్రమాలకు ఉపయోగిస్తాం’ అని చెప్పారు. లడ్డూ దక్కించుకున్న విజయ్ భాస్కర్ రెడ్డి.. ‘గణపతి లడ్డూను వేలంలో దక్కించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది’ అని అన్నారు.

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించి.. భక్తిశ్రద్ధలతో వేలంలో సొంతం చేసుకునే బాలాపూర్ లడ్డూ ఈ ఏడాది ఎన్నడూలేనంత అత్యధిక ధర పలికింది. గతంలో లేనంతగా రూ.18లక్షల 90వేల వరకూ పలికినట్లు వేలం నిర్వాహకులు వెల్లడించారు. మర్రి శశాంక్ రెడ్డి అనే వ్యక్తి ఈ సారి లడ్డూను దక్కించుకున్నారు.