Tank Bund : గణేష్ నిమజ్జనం, శోభాయాత్ర జరిగేది ఇలా

హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జనం.. నగరంలోని ప్రధాన దారుల గుండా కొనసాగనుంది. బాలాపూర్‌, ఫలక్‌నుమా నుంచి గణేశ్‌ విగ్రహాలు నిమజ్జనానికి తరలనున్నాయి

Ganesh Visarjan : హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జనం.. నగరంలోని ప్రధాన దారుల గుండా కొనసాగనుంది. బాలాపూర్‌, ఫలక్‌నుమా నుంచి గణేశ్‌ విగ్రహాలు నిమజ్జనానికి తరలనున్నాయి. బాలాపూర్‌ నుంచి వచ్చే విగ్రహాలు… చార్మినార్‌, అఫ్జల్‌గంజ్‌, గౌలిగూడ చమాన్‌, ఎంజే మార్కెట్‌, అబిడ్స్‌, బషీర్‌బాగ్‌ మీదుగా ట్యాంక్‌బండ్‌కు చేరునున్నాయి. అక్కడి నుంచి ఎన్‌టీఆర్‌ మార్గ్‌కు విగ్రహాలను తరలించనున్నారు. అక్కడే విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. బేగంబజార్‌, ఉస్మాన్‌గంజ్‌ నుంచి వచ్చే వినాయక విగ్రహాలు.. గౌలిగూడ , అబిడ్స్‌, బషీర్‌బాగ్‌ మీదుగా ట్యాంక్‌బండ్‌కు తరలనున్నాయి.

Read More : Ganesh Visarjan : బై బై గణేషా…గంగమ్మ ఒడికి గణనాథుడు

సికింద్రాబాద్‌ నుంచి వచ్చే శోభాయాత్ర ఆర్పీ రోడ్‌, కర్బాల మైదానం, కవాడీగూడ, ముషీరాబాద్‌ చౌరస్తా, హియాయత్‌నగర్‌ జంక్షన్‌, లిబర్టీ మీదుగా ట్యాంక్‌బండ్‌కుకానీ.. ఎన్టీఆర్‌ మార్గ్‌కు కానీ తరలించనున్నారు. ఇక ఉప్పల్‌ నుంచి వచ్చే శోభాయాత్ర రామంతాపూర్‌, అంబర్‌పేట, నల్లకుంట, ఫీవర్‌ ఆహాస్పిటల్‌, నారాయణగూడ, లిబర్టీ మీదుగా ఎన్టీఆర్‌ మార్గ్‌ వరకు సాగనుంది. ఇటు దిల్‌సుఖ్‌నగర్‌, అటు ఐఎస్‌ సదన్‌ నుంచి వచ్చే శోభాయాత్ర నల్లగొండ క్రాస్‌రోడ్‌, చాదర్‌ఘాట్‌, ఎంజే మార్కెట్‌ మీదుగా సాగనుంది.

Read More : Chocolate Ganesh : తియ్యతియ్యని 200 కేజీల చాక్లెట్ వినాయకుడు

ఇక టోలిచౌకి, రేతిబౌలి, మొహదీపట్నం నుంచి వచ్చే శోభాయాత్ర మాసబ్‌ట్యాంక్‌, నిరంకారి భవన్‌ మీదుగా ఎన్టీఆర్‌ మార్గ్ కు మళ్లించనున్నారు.వినాయక విగ్రహాలు తరలించే వాహనాలకు పోలీసులు కలర్‌ కోడింగ్‌ను ఏర్పాటు చేశారు. బ్లూ, ఆరెంజ్‌, రెడ్‌ అండ్‌ గ్రీన్‌ కలర్‌ కోడింగ్‌ను కేటాయించారు. కేటాయించిన కలర్‌ కోడ్‌ ఆధారంగా రూట్‌మ్యాప్‌ సిద్దం చేశారు. 2021, సెప్టెంబర్ 20వ తేదీ సోమవారం ఉదయం 6 గంటలలోపు గణేశ్‌ విగ్రహాల సామూహిక శోభాయాత్ర పూర్తి చేయాలని పోలీసులు టార్గెట్‌గా పెట్టుకున్నారు.

Read More : Chintamani Vinayaka : చింతలు తీర్చే‘చింతామణి’ వినాయకుడు

గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా పోలీసులు నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. శోభాయాత్ర జరిగే మార్గాల్లో ట్రాఫిక్‌పై ఆంక్షలు విధించారు. ఆయా ప్రాంతాల్లోని వాహనాలను ఇతర మార్గాల గుండా మళ్లించారు. 2021, సెప్టెంబర్ 19వ తేదీ ఆదివారం  రేపు ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగనున్నాయి.  గూగుల్‌ రూట్‌ మ్యాప్‌ ద్వారా ట్రాఫిక్‌ ఆంక్షలు అమలుకానున్నాయి.

ట్రెండింగ్ వార్తలు