Ganesh Visarjan : బై బై గణేషా…గంగమ్మ ఒడికి గణనాథుడు

9 రోజులుగా భక్తుల నుంచి విశేష పూజలందుకున్న గణనాథుడు ఇవాళ గంగ ఒడికి చేరనున్నారు.

10TV Telugu News

Ganesha : 9 రోజులుగా భక్తుల నుంచి విశేష పూజలందుకున్న గణనాథుడు 2021, సెప్టెంటర్ 19వ తేదీ ఆదివారం గంగ ఒడికి చేరనున్నారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్‌లో గణేశ్‌ శోభాయాత్ర, నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. లంబోదరుడి నిమజ్జనానికి ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో 40 క్రేన్లు ఏర్పాటు చేశారు. మొత్తం జీహెచ్‌ఎంసీ పరిధిలో 330 క్రేన్లను అరెంజ్‌ చేశారు. హైదరాబాద్‌లో హుస్సేన్‌సాగర్‌తోపాటు మొత్తం 30 చెరువుల్లో గణేశ్‌ నిమజ్జనాలు కొనసాగనున్నాయి. హుస్సేన్ సాగర్‌లో 2లక్షల 50 వేల విగ్రహాలను నిమజ్జనం చేసే అవకాశముంది. 162 గణేశ్‌ యాక్షన్‌ టీమ్స్‌ విధుల్లో ఉండనున్నాయి.

Read More : Covid Vaccine : వార్నీ.. చెప్పుల కోసం వెళ్లిన బామ్మకు అరగంటలో రెండు డోసుల వ్యాక్సిన్

శోభాయాత్రలో భక్తులకు తాగునీటికి 30లక్షల వాటర్‌ ప్యాకెట్లను జలమండలి సిద్ధం చేసింది.  జీహెచ్‌ఎంసీ పరిధిలో జరిగే శోభాయాత్రకు ట్రాఫిక్‌ ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు పోలీసులు. మొదటిసారిగా పీవీ మార్గ్‌లో కూడా నిమజ్జనానికి అనుమతించడంతో ప్రత్యేక నిఘా పెట్టారు పోలీసులు. అటు ప్రత్యేకంగా 50 అంబులెన్స్‌లను కూడా ఏర్పాటు చేశారు. నగరమంతటా సీసీ కెమెరాలను ప్రత్యేకంగా అమర్చారు. ట్యాంక్‌బండ్‌పై గణేశ్‌ నిమజ్జనం కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌.

Read More : Corona : తెలంగాణలో కొత్తగా 255 కరోనా కేసులు

27 వేల మంది పోలీసు బలగాలతో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, గ్రేహౌండ్స్, ఆక్టోపస్‌తో నిఘా పెట్టామని వెల్లడించారు సీపీ. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 24 చోట్ల నిమజ్జన వేడుకలు జరుగుతాయని తెలిపారు సీపీ మహేశ్‌ భగవత్‌. దాదాపు 6 వేల మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని వెల్లడించారు మహేశ్‌ భగవత్‌. సీసీ టీవీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నామన్నారు.

Read More : Blasts In Afghanistan : వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన అఫ్ఘానిస్తాన్‌

గణేశ్‌ నిమజ్జనం వీక్షించేందుకు వచ్చే భక్తుల కోసం  జీహెచ్‌ఎంసీ జోన్‌ పరిధిలో 565 ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. ఇవాళ రాత్రి 10 గంటల నుంచి రేపు ఉదయం 4 గంటల వరకు ఎంఎంటీఎస్‌ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. మెట్రో కూడా అర్థరాత్రి వరకూ సర్వీసులను నడపనుంది. రాత్రి ఒంటిగంటకు బయలుదేరే చివరి రైలు 2గంటలకు ఆఖరి స్టేషన్‌ చేరుకుంటుంది.

×