Blasts In Afghanistan : వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన అఫ్ఘానిస్తాన్‌

అఫ్ఘానిస్తాన్ వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. కాబూల్‌కు 80 మైళ్ల దూరంలోని జలాలాబాద్‌లో తాలిబన్ వాహనాలే లక్ష్యంగా వరుస పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. 20మంది తీ

Blasts In Afghanistan : వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన అఫ్ఘానిస్తాన్‌

Blasts In Afghanistan

Blasts In Afghanistan : అఫ్ఘానిస్తాన్ వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. కాబూల్‌కు 80 మైళ్ల దూరంలోని జలాలాబాద్‌లో తాలిబన్ వాహనాలే లక్ష్యంగా వరుస పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. 20మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడులకు తమదే బాధ్యత అని ఇంతవరకు ఏ గ్రూపు ప్రకటించుకోలేదు. అయితే తాలిబన్ల ప్రభుత్వానికి ఐసిస్ నుంచి ముప్పు పొంచి ఉన్న కారణంగా.. వారే ఈ దాడులకు పాల్పడి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Junk Mails Delete : అదేపనిగా జంక్ మెయిల్స్ వస్తున్నాయా? ఒకేసారి డిలీట్ చేసుకోవచ్చు!

నంగర్‌హార్‌ ప్రావిన్స్‌ రాజధాని జలాలాబాద్‌లోని తాలిబాన్ వాహనాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్లు స్థానిక అధికారులు తెలిపారు. తాలిబన్‌ దళాల వాహనాలు వెళ్తుండగా రోడ్డు పక్కన అమర్చిన మందుపాతరను పేల్చారని చెప్పారు.

Aadhaar : మీ ఆధార్ ఏ బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయిందో చెక్ చేయండిలా!

గాయపడిన సుమారు 20 మందిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో చాలామంది పౌరులే. కాగా, ఆగస్ట్‌ 15న అఫ్ఘానిస్థాన్‌ను తాలిబన్లు మరోసారి తమ నియంత్రణలోకి తెచ్చుకున్నప్పటి నుంచి ఆ దేశంలో పలు చోట్ల బాంబు పేలుళ్లు జరుగుతూనే ఉన్నాయి.