Covid Vaccine : వార్నీ.. చెప్పుల కోసం వెళ్లిన బామ్మకు అరగంటలో రెండు డోసుల వ్యాక్సిన్

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. అర్హులైన వారికి టీకాలు ఇస్తున్నారు. రికార్డు స్థాయిలో టీకాలు వేస్తున్నారు. అయితే కొన్నిచోట్ల వ్యాక్సినేషన్‌లో పలు తప్పిదాల

Covid Vaccine : వార్నీ.. చెప్పుల కోసం వెళ్లిన బామ్మకు అరగంటలో రెండు డోసుల వ్యాక్సిన్

Covid Vaccine

Covid Vaccine : దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. అర్హులైన వారికి టీకాలు ఇస్తున్నారు. రికార్డు స్థాయిలో టీకాలు వేస్తున్నారు. అయితే కొన్నిచోట్ల వ్యాక్సినేషన్‌లో పలు తప్పిదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ ఆరోగ్య అధికారి తప్పిదం కారణంగా అరగంట వ్యవధిలోనే వృద్ధురాలికి రెండు డోసుల వ్యాక్సిన్‌ వేశారు.

84ఏళ్ల వృద్ధురాలికి అర‌గంట వ్య‌వ‌ధిలో కొవిషీల్డ్ రెండు డోసుల వ్యాక్సిన్ ఇచ్చిన ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఎర్నాకులం జిల్లాలోని అలువా ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. 84 ఏళ్ల తుండ‌మ్మ అనే మ‌హిళ త‌న కుమారుడితో వ‌చ్చి వ్యాక్సిన్ మొద‌టి డోసు తీసుకుంది. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయింది. అయితే, చెప్పులు మ‌రిచిపోవ‌డంతో తెచ్చుకునేందుకు మళ్లీ ఆసుపత్రికి వెళ్లింది. వ్యాక్సిన్ అందించే వైద్య అధికారి ఆమెను లోప‌లికి పిలిచి మ‌రో డోసు వ్యాక్సిన్ వేశాడు. తాను అర‌గంట క్రిత‌మే డోసు తీసుకున్నానని, చెప్పుల కోసం వచ్చానని ఆమె చెబుతున్నా.. వినిపించుకోకుండా రెండో డోసు ఇచ్చారు. దీంతో ఆ వృద్ధురాలు ఆందోళ‌నకు గురయ్యారు.

Junk Mails Delete : అదేపనిగా జంక్ మెయిల్స్ వస్తున్నాయా? ఒకేసారి డిలీట్ చేసుకోవచ్చు!

ఆ తర్వాత అసలు విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది ఆమెను ఓ గంటపాటు అక్కడే ఉండాలని కోరారు. దీంతో అమె అలాగే చేసింది. ఆమెలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. తండమ్మను ఇంటికి పంపారు.

తాను అప్పటికే తొలి డోసు వేయించుకున్నానని చెబుతున్నా వైద్య సిబ్బంది వినిపించుకోలేదని, కుర్చీలో కూర్చోమని చెప్పి వెంటనే మరో డోసు టీకా ఇచ్చేశారని వృద్ధురాలు వాపోయారు.

Aadhaar : మీ ఆధార్ ఏ బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయిందో చెక్ చేయండిలా!

కరోనా టీకా వేయించుకున్న వారు ఒక డోసుకు మరో డోసుకు మధ్య నిర్ణీత వ్యవధి ఉండేలా చూసుకోవాలని ప్రభుత్వ మార్గదర్శకాలు చెబుతున్నాయి. అయితే, రెండు డోసులు వెంటవెంటనే ఇచ్చిన ఘటన హాట్ టాపిక్ గా మారింది. వైద్య సిబ్బంది తొందరపాటు తనాన్ని, నిర్లక్ష్యాన్ని తప్పుపడుతున్నారు.

భారత్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 79 కోట్ల కోవిడ్-19 వ్యాక్సిన్ డోసులను ప్రజలకు ఇచ్చారు. అక్టోబర్ నాటికి 100 కోట్ల డోసులు పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేవలం శుక్రవారం రోజే రెండు కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను లబ్ధిదారులకు అందించారు.