Ghmc Fake Finger Print Case (2)
GHMC fake finger print case : హైదరాబాద్ GHMC ఫేక్ ఫింగర్ ప్రింట్స్ కేసును టాస్క్ ఫోర్స్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దీంట్లో భాగంగా గోషామహల్ ఎస్ఎఫ్ఏ వెంకటరెడ్డితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. యూట్యూబ్ లో చూసి ఫెవికాల్, ఎంసీల్ మిక్స్ చేసి ఫేక్ వేలిముద్రలు తయారు చేసినట్లుగా అధికారుల దర్యాప్తులో వెల్లడైంది.
యూట్యూబ్ లో చూసి కృత్రిమ వేలిముద్రలు తయారీ చేసినట్లు తెలిపారు. ఫెవికాల్, ఎమ్ సీల్ మిక్స్ చేస్తే వచ్చిన సింథటిక్ లాంటి పదార్థాన్ని తమతో పాటు ఫీల్డ్ లోకి తీసుకెళ్లి పంచింగ్ చేశారు. 21 కృత్రిమ ఫింగర్ ప్రింట్స్ స్వాధీనం చేసుకోగా త్వరలో అసలు సూత్రధారులేవరో బయటపెడతామని సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు.