Hyderabad : పైకి లేపే ప్రయత్నం విఫలం.. చింతల్‌లో పక్కకు ఒరిగిన భవనం కూల్చివేత
Hyderabad : ఇంటిని పైకి లేపే క్రమంలో కుంగిపోయి పక్కనే ఉన్న భవనంపైకి ఒరిగిపోయింది. బిల్డింగ్ ను కూల్చివేసే క్రమంలో రెండో భవనం..

Hyderabad Chintal Building
Hyderabad – Chintal : హైదరాబాద్ చింతల్ లో హైడ్రాలిక్ జాకీల సాయంతో భవనాన్ని పైకి లేపే ప్రయత్నం విఫలం కావడం, ఆ భవనం పక్కకు ఒరగడం తెలిసిందే. పక్కకు ఒరిగిన బిల్డింగ్ ప్రమాదకరంగా మారడంతో జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. ఆ భవనాన్ని అధికారులు కూల్చేశారు. జాకీలతో ఇంటిని పైకి లేపాలని చూడగా ఆ ప్రయత్నం విఫలమైంది.
పక్కింటిపై ఒరిగిన భవనం..
ఆ భవనాన్ని పూర్తిగా నేలమట్టం చేశారు. రోడ్డు ఎత్తు పెంచడంతో చింతల్ శ్రీనివాస్ నగర్ కు చెందిన నాగేశ్వర రావు భవనం రోడ్డు కంటే దిగువలో ఉంది. దాంతో హైడ్రాలిక్ జాకీలతో భవనం ఎత్తు పెంచాలని చూశాడు. తమిళనాడుకి చెందిన బిల్డింగ్ లిఫ్ట్ సర్వీస్ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చాడు. ఇంటిని పైకి లేపే క్రమంలో కుంగిపోయి పక్కనే ఉన్న భవనంపైకి ఒరిగిపోయింది. ఒరిగిన బిల్డింగ్ ను కూల్చివేసే క్రమంలో రెండో భవనం పాక్షికంగా దెబ్బతింది.(Hyderabad)
రోడ్డున పడ్డ బాధితులు..
కాగా.. బిల్డింగ్ కూల్చివేతతో అందులో అద్దెకు ఉండే బాధితులు రోడ్డున పడ్డారు. ఉండటానికి ఇల్లు లేక, తినడానికి తిండి లేక అల్లాడుతున్నారు. అధికారులు సైతం తమను పట్టించుకోవడం లేదని కన్నీటిపర్యంతం అయ్యారు. తాము సర్వస్వం కోల్పోయామని, తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
Also Read..BRS Expansion: సర్వే సంస్థల నివేదికల ఆధారంగా.. జాతీయస్థాయిలో కేసీఆర్ పకడ్బందీ స్కెచ్!
బెడిసికొట్టిన ప్రయత్నం..
చింతల్‌లో ఓ ఇంటి యజమాని ఒకటి అనుకుంటే మరొకటి జరిగింది. ఆయన చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. రోడ్డు కంటే కిందున్న తన ఇంటిని జాకీలతో పైకి లేపి, ఎత్తు పెంచాలని ప్రయత్నించాడు. అయితే, జాకీలు పక్కకు జరగడంతో బిల్డింగ్ పక్కింటిపై ఒరిగింది. దీంతో ఆ బిల్డింగ్ లో ఉన్నవారు భయాందోళనకు గురయ్యారు. ప్రాణ భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ అధికారులు ఆ బిల్డింగ్ ను పరిశీలించి, దాన్ని కూల్చేయాలని నిర్ణయించారు. కాగా, వానా కాలం వరద ముప్పును తప్పించుకునేందుకు యజమాని చేసిన ప్రయత్నం బెడిసికొట్టి పూర్తిగా ఇల్లును కూల్చేయాల్సి వచ్చింది.(Hyderabad)
వరద నీరు ఇంట్లోకి రాకుండా చేయాలనుకుంటే..
చింతల్ కు చెందిన నాగేశ్వరరావు 25ఏళ్ల కిందట శ్రీనివాస్ నగర్ లో ఇల్లు కట్టుకున్నారు. కాలక్రమంలో ఇంటి ముందున్న రోడ్డు ఎత్తు పెరిగింది. వర్షాకాలంలో నీరంతా ఇంట్లోకి చేరుతున్నాయి. దాంతో ఈ ఏడాది వరద నీరు ఇంట్లోకి రాకుండా నాగేశ్వరరావు చర్యలు చేపట్టారు. తన ఇంటిని ఎత్తు పెంచాలని నిర్ణయించుకున్నారు. ఈ పనిని ఓ సంస్థకు అప్పగించారు. హైడ్రాలిక్ జాకీలతో ఇంటిని నెమ్మదిగా పైకి లేపడం మొదలుపెట్టాక.. జాకీలు పక్కకు జరగడంతో ఇల్లు పక్క బిల్డింగ్ పైకి వాలింది. జీ ప్లస్ 2 విధానంలో నిర్మించిన ఈ భవనం మొత్తం పక్క బిల్డింగ్ పై వాలింది.
ఇంటి ఓనర్ పై కేసు నమోదు..
దాంతో కాలనీ వాసులు భయాందోళన చెందారు. ఎప్పుడేం జరుగుతుందోనని కంగారు పడ్డారు. ఇంటి ఎత్తు పెంచే క్రమంలో జాకీలు పక్కకు జరగడంతో ఈ ఘటన చోటు చేసుకుందని అధికారులు వివరించారు. కాగా, ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండానే మరమ్మతు పనులు చేపట్టడంతో ఇంటి యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.(Hyderabad)