Taj Banjara Hotel
హైదరాబాద్, బంజారాహిల్స్‌లోని తాజ్ బంజారా హోటల్‌కు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారులు షాక్ ఇచ్చారు. తాజ్ బంజారా హోటల్ రెండేళ్లుగా ట్యాక్స్ చెల్లించకపోవడంతో దాన్ని అధికారులు సీజ్ చేశారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. హోటల్ గేట్‌లను మూసేసి అధికారులు సీల్ వేశారు. ట్యాక్స్ చెల్లించాలని ఆ హోటల్‌కు అధికారులు పలుసార్లు నోటీసులు పంపినప్పటికీ యాజమాన్యం స్పందించకపోవడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు.
Also Read: ఆలయాలకు ర్యాంకులు.. కాణిపాకం టాప్.. ఫుల్ లిస్ట్ ఇదిగో..
తాజ్ బంజారా హోటల్‌కు సంబంధించి కొన్ని కోట్ల టాక్స్ పెండింగ్ ఉందని తెలుస్తోంది. జీహెచ్ఎంసీ అధికారులు మొత్తం 5 సార్లు నోటీసులు ఇచ్చారు. స్పందన లేకపోవడంతో జీహెచ్ఎంసీ అధికారులు ఇవాళ ఉదయం హోటల్‌కు వచ్చి సీజ్ చేశారు.
హైదరాబాద్‌లో తాజ్ బంజారా హోటల్ చాలా ఫేమస్. ఈ హోటల్‌కు సెలబ్రెటీలు సైతం అధికంగా వస్తుంటారు. హైదరాబాద్‌కు క్రికెటర్లు వస్తే ఈ హోటల్‌లోనే ఉంటారు. దేశంలోని చాలా మంది ప్రముఖులు ఈ హోటల్‌లోనే బస చేస్తుంటారు. ఈ హోటల్‌లో రాజకీయ పార్టీ సమావేశాలు కూడా జరుగుతుంటాయి.