Malkajgiri : లక్ష్మీ విలాస్ బ్యాంకులో బంగారం చోరీ, బ్యాంకు ఉద్యోగి పనేనా ?
భద్రంగా భావించే బ్యాంకులోనే దొంగలుంటే.. మన సొమ్ముకు భద్రత ఎక్కడ ఉంటది? వాటిని ఎలా కాపాడుకోవాలి?

Mkg
Lakshmi Vilas Bank : బ్యాంకు అంటేనే భద్రంగా భావిస్తాం. మన డబ్బు, విలువైన వస్తువులను చోరీగాళ్ల నుంచి రక్షించుకునేందుకు బ్యాంకులోనే సేఫ్‌గా ఉంటాయని అక్కడ దాచేస్తాం. మరి భద్రంగా భావించే బ్యాంకులోనే దొంగలుంటే.. మన సొమ్ముకు భద్రత ఎక్కడ ఉంటది? వాటిని ఎలా కాపాడుకోవాలి? తాజాగా హైదరాబాద్ మల్కాజ్‌గిరిలోని ఓ బ్యాంకులో బంగారం మాయమైన ఘటన కలకలం రేపింది.
Read More : Jana Ashirwad Yatra : కిషన్ రెడ్డి భావోద్వేగం, ముగిసిన జన ఆశీర్వాద యాత్ర
మల్కాజ్‌గిరి ఆర్.కె. నగర్ లోని లక్ష్మీ విలాస్ బ్యాంక్ లాకర్ లో సుమారు 10 లక్షల రూపాయల విలువ చేసే బంగారం మాయమైంది. ఆ బంగారం కూడా బ్యాంకులో పనిచేసే అసిస్టెంట్ మేనేజర్ సాయి గౌతమ్‌కు చెందినదిగా గుర్తించారు. వెంటనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. క్లూస్ టీమ్‌తో బ్యాంకులో ఆధారాలు సేకరించిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Read More : Shatrughan Sinha Twitter: శత్రుఘ్న సిన్హా ట్విట్టర్ అకౌంట్‌కు ఎలన్ మస్క్ పేరు
అయితే ఖచ్చితంగా ఇది ఇంటి దొంగల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. బ్యాంకులో పనిచేసే ఓ ఉద్యోగి హస్తం ఉండొచ్చని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ప్రజల డబ్బు, వస్తువులను భద్రంగా దాచాల్సిన ఈ బ్యాంకులో మాత్రం సీసీ కెమెరాలు కూడా పనిచేయకపోవడం విమర్శలకు దారి తీస్తోంది.