Jubilee Hills : పబ్‌‌లో చేతివాటం.. బంగారం చోరీ చేసిన కేటుగాళ్లు

పబ్‌కి వచ్చిన దంపతులు వ్యాలేట్ పార్కింగ్ ఉండటంతో కారు కీస్ డ్రైవర్‌కి ఇచ్చి పబ్‌లోకి వెళ్లారు. తిరిగి వచ్చే చూసే సరికి కారులోని బంగారు ఆభరణాలు కనిపించలేదు.

jubilee hills theft

Jubilee Hills : జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్ పార్కింగ్ ఏరియాలో చోరీ జరిగింది. పబ్‌కి వచ్చిన దంపతులు వ్యాలేట్ పార్కింగ్ ఉండటంతో కారు కీస్ డ్రైవర్‌కి ఇచ్చి పబ్‌లోకి వెళ్లారు. తిరిగి వచ్చే చూసే సరికి కారులోని బంగారు ఆభరణాలు కనిపించలేదు.. దీంతో వెంటనే పబ్ నిర్వాహకులను విషయం తెలిపారు. సీసీకెమెరాలు చూడాలని కోరారు.. పబ్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో దంపతులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

చదవండి : Theft In Police Officers Apartement : పోలీసాఫీసర్లు ఉండే అపార్ట్‌మెంట్ లోనే చోరీ

కేసు నమోదు చేసుకున్నపోలీసులు, పబ్ సిబ్బందిని విచారించి వదిలేసినట్లుగా సమాచారం. అయితే పార్కింగ్ ప్లేస్‌లో సీసీ కెమెరాలు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ ఘటనపై విచారణ వేగవంగం చేసి తమకు న్యాయం చేయాలనీ పోలీసులను వేడుకుంటున్నారు బాధితులు.

చదవండి : Hyderabad Thefts: రాష్ట్ర రాజధానిని నమ్మకంతో ముంచేస్తున్న నేపాలీ గ్యాంగ్