Liquor Price Drop: మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా ధరలు తగ్గాయ్
దీంతో అన్ని రకాల మద్యం బ్రాండ్స్ ధరలు తగ్గాయి. అయితే అన్ని బ్రాండ్ల ధరలు తగ్గించిన ప్రభుత్వం.. బీర్ల ధరలు మాత్రం తగ్గించలేదు. అక్రమ మద్యం కట్టడిలో భాగంగా ధరల తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Liquor Price Drop: తెలంగాణలోని మద్యం ప్రియులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మద్యంపై భారీగా ధరలు తగ్గిస్తూ కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా, తగ్గిన ఈ ధరలు శుక్రవారం రాత్రి నుంచే అమలులోకి వస్తాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతో అన్ని రకాల మద్యం బ్రాండ్స్ ధరలు తగ్గాయి. అయితే అన్ని బ్రాండ్ల ధరలు తగ్గించిన ప్రభుత్వం.. బీర్ల ధరలు మాత్రం తగ్గించలేదు. అక్రమ మద్యం కట్టడిలో భాగంగా ధరల తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
తగ్గిన ధరలు ఇవి..
90ml మీద 10 రూపాయలు తగ్గింపు
180ml (క్వార్టర్) మీద 10 రూపాయలు తగ్గింపు
375ml (హాఫ్) మీద 20 రూపాయలు తగ్గింపు
750ml (ఫుల్) మీద 40 రూపాయలు తగ్గింపు