Telangana Farmers : రైతులకు గుడ్ న్యూస్, 15 నుంచి రైతు బంధు

ఈ నెల 15వ తేదీ నుంచే రైతుబంధు నిధులు అందచేయనున్నట్లు, రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడం జరుగుతుందని మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. 2021, జూన్ 10వ తేదీ వరకు పట్టాదార్ పాస్ పుస్తకం పొంది సీసీఎల్ఏ ద్వారా..ధరణి పోర్టల్ లో చేర్చబడిన రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నిధులు జమ చేయడం జరుగుతుందన్నారు.

Rythu Bandhu : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ వినిపించింది ప్రభుత్వం. ఈ నెల 15వ తేదీ నుంచే రైతుబంధు నిధులు అందచేయనున్నట్లు, రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడం జరుగుతుందని మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. 2021, జూన్ 10వ తేదీ వరకు పట్టాదార్ పాస్ పుస్తకం పొంది సీసీఎల్ఏ ద్వారా..ధరణి పోర్టల్ లో చేర్చబడిన రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నిధులు జమ చేయడం జరుగుతుందన్నారు. రైతుబంధు నిధుల విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు. అపోహకు గురి కావాల్సిన అవసరం లేదని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.

తొలిసారి పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతుల బ్యాంకు అకౌంట్ వివరాలు వ్యవసాయ అధికారులు సేకరిస్తారన్నారు. రైతులు స్థానిక ఏఈవోలను సంప్రదించాలన్నారు. రైతులు బ్యాంక్ అకౌంట్, పట్టాదారు పాస్ బుక్, ఆధార్ కార్డు వివరాలు వ్యవసాయ అధికారులకు అందచేయాలన్నారు.

ఇప్పటికే వారి వారి బ్యాంకు అకౌంట్లు సరిచూసుకోవాలని అధికారులు సూచించిన సంగతి తెలిసిందే. ఆంధ్రా బ్యాంకు, దేనా బ్యాంకు, విజయ బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, సిండికేట్ బ్యాంకు, ఓరియంటల్ బ్యాంకు ఇతర బ్యాంకుల్లో విలీనం అయిన సంగతి తెలిసిందే. బ్యాంకుల్లో ఉన్న ఖాతాదారుల అకౌంట్లు, IFSC కోడ్ మారాయి. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా మరోసారి నూతన అకౌంట్ల నంబర్లు, IFSC కోడ్ నంబర్లను తీసుకుని ఆయా క్లస్టర్లకు చెందిన బ్యాంకు ఏఈవోలకు అందచేయాలని సూచించారు. జూన్ 10వ తేదీ వరకు సంబంధిత ఏఈవోలకు కొత్త పాస్ బుక్‌లతో పాటు..ఖాతా వివరాలు సమర్పించాల్సి ఉంటుందన్నారు.

Read More : Delhi Govt Hospital : నర్సులు మలయాళంలో మాట్లాడొద్దు

ట్రెండింగ్ వార్తలు