తెలంగాణలో ఆ ముగ్గురికి ఎమ్మెల్సీ పదవులు

  • Publish Date - November 13, 2020 / 05:34 PM IST

Three MLCs in Telangana : తెలంగాణలో ముగ్గురికి ఎమ్మెల్సీ పదవులు దక్కాయి . గవర్నర్ కోటాలో ముగ్గురిని సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు. బస్వరాజు సారయ్య, గోరటి వెంకన్న, దయానంద గుప్తాలు ఎమ్మెల్సీ పదవులకు ఎంపిక అయ్యారు. త్వరలో మూడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి.



ఎమ్మెల్సీ మూడు స్థానాలు కూడా అధికార టీఆర్‌ఎస్‌కే దక్కే అవకాశం ఉండటంతో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభమైంది. అభ్యర్థుల జాబితా ఇప్పటికే ఖరారైనట్లు టీఆర్‌ఎస్‌ వర్గాల ద్వారా తెలుస్తోంది.

కవి గోరెటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్, మాజీమంత్రి బస్వరాజు సారయ్య పేర్లను పరిశీలించిన అనంతరం కేసీఆర్ ఈ ముగ్గురి పేర్లను ఎమ్మెల్సీ పదవులకు ఎంపిక చేశారు. ఈ నెలలో  రేపు (శనివారం, నవంబర్ 14) గోరటి వెంకన్న, దయానంద్ గుప్తా, బసవరాజు సారయ్య ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.



తెలంగాణ ఉద్యమ సమయంలో గోరెటి వెంకన్నతో పాటు, దేశపతి శ్రీనివాస్‌ క్రియాశీలకంగా వ్యవహరించారు. తెలంగాణ భాషను, యాసను ప్రజల్లోకి తీసుకెళ్లి ఉద్యమ ఆకాంక్షను మరింత బలోపేతం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపరుస్తూ బస్వరాజు సారయ్య టీఆర్‌ఎస్‌లో చేరారు.



గవర్నర్‌ కోటాలో బస్వరాజును ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. దివంగత నాయిని నర్సింహారెడ్డి, రాములు నాయక్, కర్నె ప్రభాకర్‌ పదవీ కాలపరిమితి ముగియడంతో ఈ ఏడాది ఆగస్టు నుంచే శాసనమండలిలో గవర్నర్‌ కోటా స్థానాలు ఖాళీగా ఉన్నాయి.