Telangana Secretariat: ఆ సారొక్కరికే 4 కార్లు..! ఫ్యూయల్, డ్రైవర్ అంతా సర్కార్ లెక్కే..! కీలక శాఖ పెద్ద బాస్ తీరే సెపరేటు..
ఇతర శాఖల ఖర్చులు, నిధులపై లెక్కలు పక్కాగా అడిగే పెద్దసారు..తాను మాత్రం..లెక్కా పత్రం లేకుండా వ్యవహరించడమేంటన్న అసంతృప్తి వ్యక్తం అవుతోందట. కానీ బయటికి ఏమనలేక..లోలోపలే నసుక్కుంటున్నారట కొందరు హైయ్యర్ అఫీషియల్స్.
- కీలక శాఖ పెద్ద బాస్ తీరే సెపరేటు..
- ఆ సారొక్కరికే ఏకంగా నాలుగు కార్లు..!
- ఎక్స్‌క్లూజివ్‌గా లంచ్ బాక్స్ కోసం ఓ కారు!
- ఇంట్లో వాళ్ల కోసం రెండు కార్లు..!
- సార్ ఇంట్లో పనోళ్లుగా..ఔట్ సోర్సింగ్ అధికారులు.!
Telangana Secretariat: ఆ సార్ రాష్ట్రంలోని ఓ కీలక శాఖకు పెద్ద బాస్. ఆ డిపార్ట్ మెంట్లో ఆయనెంత చెప్తే అంత. సార్ గారు ఓకే అంటేనే..ఏ పని అయినా జరిగేది. ఎవరికైనా బిల్లులు వెళ్లేది. ఈ స్థాయిలో పవర్ ఉన్నాక..సార్ గారు ఊరికే ఉంటారా? తన పవరేంటో చూపిస్తూ..ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు కార్లు వాడేస్తున్నారట. ఖజానాకు కాపలాగా ఉంటూ..లెక్కలన్నీ పక్కాగా ఉండేలా చూసుకోవాల్సిన అధికారే..ఖజానాకు బొక్క పెడుతున్నారనే టాక్ సెక్రటేరియట్లో గుప్పుమంటోంది. చూడ్డానికి సాఫ్ట్‌గా కనిపించే ఆయన..సొంత అవసరాలకు మాత్రం..చేతికి వెన్నెముక లేకుండా నిధులను వాడేస్తున్నారట. ఇంతకు ఎవరా సార్? ఏంటాయన తీరు?
సార్ ఓకే అంటేనే ఎవరికైనా ఖజనా నుంచి పైసల్ వెళ్లేది. ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇస్తేనే ఏ శాఖలో అయినా నిధుల వరద పారేది. చివరకు సీఎంకు అయినా ఆ సార్ చెప్తేనే ఖజానాలో ఉన్న నిల్వ ఎంతో తెలిసేది. అంతపెద్ద పోస్ట్‌లో ఉన్న ఓ ఆఫీసర్ గారు..సిబ్బందిని, నిధులను సొంతానికి తెగ వాడేస్తున్నారట. పలకరిస్తే కాని..పలుకని నైజం ఉన్న ఆయన..సొంతానికి ఏకంగా నాలుగు కార్లు యూజ్ చేసేస్తున్నారట. వాటికి ఫ్యూయల్, డ్రైవర్ అంతా…సర్కార్ లెక్కేనట. లోకంలో ఎక్కడైనా మనుషుల కోసం కారు ఉంటుంది. కానీ ఈ ‘పెద్ద సారు’ గారి రేంజే వేరు అంటున్నారు. ఆయనకు..వేడి వేడిగా ఉంటే కానీ బుక్క..నోట్లోకి పోదట. అందుకోసం..ఎక్స్‌క్లూజివ్‌గా లంచ్ బాక్స్ కోసమే ఓ కారు వాడేస్తున్నారట. ఠంఛన్‌గా..మధ్యాహ్నం లంచ్ గంట కొట్టగానే..ఆ ప్రత్యేక కారులో ప్రత్యేకంగా తయారు చేసిన వేడి వేడి లంచ్ బాక్స్ రావాల్సిందేనట.
ప్రభుత్వ సొమ్మును తన సొంత ఆస్తిలా మిస్ యూజ్..
ఇక ఒకవైపు సర్కార్..ప్రభుత్వ శాఖల్లో నకిలీ ఉద్యోగుల లెక్క తేల్చుతుంటే..ఈ సారు మాత్రం..లైట్ తీసుకుంటూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఇంట్లో పనుల కోసం వాడేస్తున్నారట. వారి డ్యూటీ పేరుకు సచివాలయంలో కానీ..విధులు మాత్రం ఆ పెద్ద సార్ ఇంట్లోనే అంటున్నారు. ఇదేంటని ఆయన్ను అడిగే నాథుడు లేడు..అడ్డు చెప్పేవారే లేరట. దీంతో ప్రభుత్వ సొమ్మును తన సొంత ఆస్తిలా మిస్ యూజ్ చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సదరు ఆఫీసర్ తీరుతో సెక్రటేరియట్ సిబ్బందే షాక్ అవుతున్నారట.
ఏమైనా అందామంటే..ఆయనేమో..పెద్ద సార్..
ఇతర శాఖల ఖర్చులు, నిధులపై లెక్కలు పక్కాగా అడిగే పెద్దసారు..తాను మాత్రం..లెక్కా పత్రం లేకుండా వ్యవహరించడమేంటన్న అసంతృప్తి వ్యక్తం అవుతోందట. కానీ బయటికి ఏమనలేక..లోలోపలే నసుక్కుంటున్నారట కొందరు హైయ్యర్ అఫీషియల్స్. పైసల్ మిస్ యూజ్ కాకుండా..పక్కదారి పట్టకుండా చూడాల్సిన అధికారే ఇలా చేస్తుంటే..వాట్ ఈజ్ దిస్ అని క్వశ్చన్ చేయాలని అనిపించినా..గమ్మున ఉండిపోతున్నారట. ఏమైనా అందామంటే..ఆయనేమో..పెద్ద సార్. రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద పోస్టుకు వెళ్లే అధికారి. ఎందుకొచ్చిన గొడవ అంటూ..పెద్ద సారా..మజాకా అని జోకులు వేసుకుంటున్నారట మిగతా అధికారులు.
Also Read: పొత్తు ఉండబోదని ఒట్టేసి చెప్పాలి.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్ వెనుక పెద్ద ప్లానే..!
