Gossip Garage: బీఆర్ఎస్ నుంచి తనను సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నారా? కొత్త పార్టీ పెడతారా? అసలు కవిత స్ట్రాటజీ ఏంటి..

కేసీఆర్‌ను దేవుడు అంటూనే..పార్టీలో ఉన్న నేతలందరినీ టార్గెట్ చేస్తున్నారు. ఏకంగా బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతుందంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చి పెద్ద చర్చకు దారితీశారు కవిత.

Gossip Garage: అక్క లెటర్. ఆపై సంచలన కామెంట్స్. అయినా బీఆర్ఎస్ సైలెన్స్. అంతటితో ఆ రచ్చ అయిందనుకుంటే.. చిట్‌చాట్‌ పేరుతో పెద్ద కామెంట్సే చేశారు ఎమ్మెల్సీ కవిత. కేసీఆరే తమ నాయకుడు అంటున్నారు. బీఆర్ఎస్‌లోనే ఉంటానంటున్నారు. కానీ ఎక్కడో తేడా కొడుతుంది శీనా అన్నట్లుగా ఉంది ఆమె మాటల తీరు. బీఆర్‌ఎస్‌ మౌనంగా ఉంటున్నా కవిత ఎందుకు వాయిస్‌ రేజ్‌ చేస్తున్నారు? బీఆర్‌ఎస్‌ నుంచి కవిత ఎక్స్‌పెక్ట్ చేస్తుందేంటి? ఆమె అనుకున్న ఎజెండా ప్రకారమే కావాలని ఇలాంటి స్టేట్‌మెంట్లు ఇస్తున్నారా?

కవిత. డాటర్ ఆఫ్ కేసీఆర్. వారం రోజులుగా ఆమె రాసిన లెటర్‌ సెంట్రిక్‌గానే తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ హాట్ డిస్కషన్. చివరకు లేఖ రాసింది తానే.. లీక్ చేసిందెవరో చెప్పాలంటూ కవిత ప్రశ్నించడంతో..అదంతా బీఆర్ఎస్‌ ఇంటర్నల్ ఇష్యూ అన్నట్లుగా కనిపించింది. కట్‌ చేస్తే వరుస పెట్టి జాగృతి కార్యకర్తలతో భేటీలు నిర్వహించడం..కమిటీలు వేయడంతో ఏదో జరుగుతుందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయ్.

నన్ను పార్టీలో నుంచి పంపించే దమ్ము ఎవరికీ లేదు..!
ఈ నేపథ్యంలోనే జూన్‌ 2న కవిత పార్టీ పెడతారంటూ జాగృతి కార్యకర్తలే జోరుగా ప్రచారం చేస్తున్నారు. పార్టీ పేరు కూడా చెప్పేస్తున్నారు. తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పేరుతో కవిత TBRS పార్టీ పెట్టబోతున్నట్లు లీకులు ఇస్తున్నారు. అయితే ఇదంతా ట్రాష్ అంటున్నారు కవిత. ఎక్కడికీ పోను..బీఆర్ఎస్‌లోనే ఉంటాను..తనను పార్టీలో నుంచి పంపించే దమ్ము ఎవరికీ లేదంటూ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. కేసీఆర్ తప్ప పార్టీలో ఎవరి నాయకత్వాన్ని ఒప్పకోనంటున్నారు. దీంతో ఇదంతా బానే ఉంది కానీ..కవిత మనసులో ఏదో ఉందన్న టాక్ వినిపిస్తోంది.

కేటీఆర్‌ టార్గెట్‌గానే కవిత బాణాలు ఎక్కుపెట్టారు. కేసీఆర్‌ను దేవుడు అంటూనే..పార్టీలో ఉన్న నేతలందరినీ టార్గెట్ చేస్తున్నారు. ఏకంగా బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతుందంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చి పెద్ద చర్చకు దారితీశారు కవిత. ఈ కామెంట్స్‌ అన్నీ బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్‌ ఇగోను టచ్‌ చేసేలా ఉన్నాయనేది పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్‌ మాట. కవిత కూడా స్ట్రాటజీ ప్రకారమే ఇలా మాట్లాడుతున్నారన్న ఒపీనియన్స్‌ కూడా వ్యక్తం చేస్తున్నారు.

Also Read: రాహుల్ గాంధీ ప్రధాని అయితే.. చైనా, పాకిస్తాన్ రెండింటినీ ఓడిస్తారు- సీఎం రేవంత్ రెడ్డి

పార్టీ నుంచి సస్పెండ్‌ చేసేలా గేమ్ ప్లాన్?
ఆమె ఇప్పటికే ఓ ఎజెండాతో పని చేస్తున్నారని..ఆ ప్రకారమే మీడియా ముందుకొచ్చి స్టేట్‌మెంట్లు ఇవ్వడం..ఆఫ్‌ ది రికార్డులో చిట్‌చాట్ చేయడం వంటివి ప్లాన్‌లో భాగమేనన్న చర్చ జరుగుతోంది. పార్టీ నుంచి తనను సస్పెండ్‌ చేసేలా బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని కవిత ఇండైరెక్ట్‌గా ప్రెజర్‌ చేస్తున్నారనే వాదన కూడా ఉంది.

సింపతీ కోసమే కవిత మైండ్ గేమ్?
తనంతట తానుగా పార్టీకి రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టుకుంటే అనుకున్నంత మైలేజ్‌ రాకపోవచ్చని కవిత భావిస్తున్నారంటున్నారు. అందుకే బీఆర్ఎస్ నుంచి తనను సస్పెండ్ చేస్తే సింపతీ వస్తుందనే ఆలోచనతో ఆమె మైండ్‌గేమ్‌ ఆడుతున్నారన్న టాక్ కూడా ఉంది. పార్టీనే తనను ఎక్స్‌పెల్‌ చేస్తే మీడియా ముందుకు వచ్చి..ఉద్యమంలో ఎంతో శ్రమించిన తనకు అన్యాయం చేశారని..ఆడపిల్లనైనా తన మీద కుట్రలు చేసి పంపించారని చెప్పి..నెక్స్ట్‌ స్టెప్‌ తీసుకోవాలనే ఆలోచన కూడా ఉండొచ్చంటున్నారు.

పార్టీనే తనను సస్పెండ్ చేసేలా వ్యూహం..!
సేమ్‌టైమ్ తన జోలికి వస్తే బాగుండదంటూ వార్నింగ్ ఇస్తున్నారు కవిత. తాను నోరు తెరిస్తే వేరేలా ఉంటుందంటూ హెచ్చరించడం కూడా తన పొలిటికల్‌ స్ట్రాటజీలో భాగమేనన్న చర్చ జరుగుతోంది. ఎలా చూసుకున్నా కవిత బీఆర్ఎస్‌తో బంధం తెంచుకోవడం ఖాయమేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే తనకు తానుగా పార్టీని వీడటం కాకుండా..పార్టీనే తనను సస్పెండ్ చేసేలా వ్యూహాన్ని అమలు చేస్తున్నారని అంటున్నారు పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్‌.

అందుకే బీఆర్ఎస్‌ ఎంత సైలెంట్‌గా ఉన్నా కవిత అసంతృప్తి గళం వినిపిస్తున్నారని అంటున్నారు. పైగా కేటీఆర్‌ను టార్గెట్‌ చేస్తూ బీఆర్ఎస్‌ ఫ్యూచర్‌ లీడర్‌గా ఆయనను యాక్సెప్ట్‌ చేయనని చెప్పకనే చెప్తున్నారు కవిత. ఆమె రాబోయే రోజుల్లో కూడా ఇలాగే తన వాయిస్‌ వినిపించే అవకాశం ఉందంటున్నారు. బీఆర్ఎస్‌ అగ్రనాయకత్వం చర్యలు తీసుకునే వరకు తను ఎలాంటి స్టెప్‌ తీసుకున్నా ప్రజల నుంచి అంత రెస్పాన్స్ రాదేమోనన్న భావనలో కూడా కవిత ఉన్నారట. ఏదేమైనా కవిత ఎపిసోడ్‌ కారు పార్టీలో కలకలం రేపడంతో పాటు..అపోజిషన్‌లో ఉన్న బీఆర్ఎస్‌ అందరికీ విమర్శనాస్త్రంగా మారుతోంది.