Kavitha Districts Tour: అక్క జిల్లాల పర్యటనకు రెడీ అయింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు 33 జిల్లాలను చుట్టేస్తానంటోంది. బట్ ఏ బిగ్ చేంజ్. జిల్లాల యాత్ర పోస్టర్‌లో కేసీఆర్ ఫోటో లేదు. తండ్రి కేసీఆర్ ఇమేజ్‌ని పక్కన పెట్టి కవిత రాజకీయం చేయాలనుకుంటున్నారా? జనంలోకి వెళ్తే వచ్చే రెస్పాన్స్‌ను పొలిటికల్ పార్టీపై నిర్ణయం తీసుకోబోతున్నారా? సొంతంగా రాజకీయ పార్టీ పెడితే కవిత సక్సెస్ అవుతారా? సార్ కూతురుగా కాకుండా జాగృతి అధ్యక్షురాలిగా కవితను జనం ఆదరిస్తారా?
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పంథా రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఆమె.. తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటం అంటూ తెలంగాణ జాగృతి పేరుతో పలు కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె భవిష్యత్ కార్యాచరణపై కీలక ప్రకటన చేశారు. తెలంగాణ వ్యాప్తంగా యాత్ర చేయాలని డిసైడ్ అయ్యారు. సామాజిక తెలంగాణే లక్ష్యంగా 33 జిల్లాల్లో యాత్రకు రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు అన్ని జిల్లాలను కలుపుకుంటూ కవిత యాత్ర చేయనున్నారు. అయితే కవిత చేపట్టబోయే యాత్రలో ఆమె తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ ఫోటో లేకుండానే యాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ సిద్దాంతకర్త ప్రొ.జయశంకర్ ఫోటోతో ప్రజల్లోకి వెళ్లాలని కవిత డిసైడ్ చేసుకోవడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.
బీఆర్ఎస్ పార్టీ నుంచి తనను సస్పెండ్ చేశాక కూడా కవిత తన తండ్రి కేసీఆర్ ఫోటోను వాడుకున్నారు. తెలంగాణ జాగృతి పోస్టర్‌పై కేసీఆర్ ఫోటోతో పాటు జయశంకర్ ఫోటోను పెట్టారు. కానీ ఇప్పుడు సడెన్‌గా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఫోటో కూడా లేకుండా ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని కవిత నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమవుతోంది. కేసీఆర్ ఫోటో లేకుండా యాత్ర చేపట్టేందుకు రెడీ అవుతున్న కవిత అసలు ప్లాన్ ఏంటన్నదానిపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
అయితే సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తే ఎంతవరకు సక్సెస్ అవుతాననే అనుమానం కవితను పట్టిపీడిస్తోందట. ఒకవేళ రాకీయ పార్టీ పెట్టినా తన తండ్రి బీఆర్ఎస్ అధినేత కావడంతో ఆయన ఫోటోను వాడుకునే అవకాశం ఉండదని భావిస్తున్నారట. మరి కేసీఆర్ ఫోటో లేకుండా రాజకీయ పార్టీ పెట్టి జనంలోకి వెళ్తే తనను వాళ్లు ఆదరిస్తారా అన్నదానిపై కవిత సుదీర్ఘంగా చర్చలు జరిపారట. అందుకే రాజకీయ పార్టీ ఏర్పాటుకు ముందే కేసీఆర్ ఫోటో లేకుండా ప్రజల్లోకి వెళ్లాలని కవిత నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఫోటో, ఇమేజ్‌ను పక్కన పెట్టి జనంలోకి వెళ్తే వచ్చే ఆదరణను బట్టి రాజకీయ పార్టీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారట కవిత.
వచ్చే ఏడాది ఫిబ్రవరి అంటే..నాలుగు నెలల టైమ్ ఉంది. అప్పటివరకు 33 జిల్లాలను చుట్టేయాలని రూట్‌మ్యాప్ రెడీ చేసుకున్నారు కవిత. ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి పొలిటికల్ పార్టీ ఏర్పాటుపై డెసిషన్ తీసుకుంటారట. ఒకవేళ కవిత పార్టీ పెడితే వచ్చే ఏడాది ఫిబ్రవరి తర్వాతే అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ పెడితే ఎంతవరకు నెట్టుకురాగలుగుతామనే డైలమాలో ఉన్నారట కవిత.
పబ్లిక్‌లోకి వెళ్లి.. జాగృతి అధ్యక్షురాలిగా తన బలాన్ని ప్రూవ్ చేసుకోవాలనేది కవిత ఆలోచన అంటున్నారు. అయితే కేసీఆర్ ఫోటో లేకుండా కవిత పాలిటిక్స్ చేయడం సాధ్యమయ్యేనా అన్నదే పాయింట్. కవిత అంటే టక్కున కేసీఆర్ కూతురు అంటుంటారు పబ్లిక్. ఆ తర్వాతే ఆమె జాగృతి యాక్టివిటీ.. ఉద్యమంలో కవిత పాత్ర ఇవన్నీ ప్రస్తావనకు వస్తాయి. అలాంటిది తన తండ్రి ఫోటో, ఇమేజ్ లేకుండా కవిత జనంలోకి వెళ్తే..ఎంతవరకు పబ్లిక్ సపోర్ట్ దొరుకుతుందో చూడాలి.
Also Read: వేటు తప్పదా? మంత్రుల తీరుపై సీఎం రేవంత్ సీరియస్.. గాడిన పెట్టేందుకు ఏం చేయబోతున్నారు?