Gossip Garage : ఆయన కాంగ్రెస్ గూటికి చేరడం పెద్దాయనకు ఇష్టం లేదు. ఈ ముచ్చట ఓపెన్‌గానే చెప్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్సీగా తాను ఉన్నప్పటికీ..వలస ఎమ్మెల్యేకు ఇస్తున్న ప్రయారిటీ ఆయనకు మింగుడు పడటం లేదు. పలుసార్లు రచ్చ కూడా అయింది. బహిరంగంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కారు ఆ సీనియర్ నేత.
ఆ లొల్లి అలా కంటిన్యూ అవుతుండగానే.. ఓ ల్యాండ్ కబ్జాపై విచారణ జరపాలంటూ ఎమ్మెల్సీ పెట్టిన ఓ కంప్లైంట్ కొత్త చర్చకు దారి తీస్తోంది. అక్రమ పట్టాల వ్యవహారంలో ధరణిని అడ్డు పెట్టుకుని ఎమ్మెల్యే అనుచరులు కబ్జా చేశారనుకుని ఎమ్మెల్సీ రాసిన లేఖ ఇప్పుడు రచ్చకు దారి తీసింది. ఎరక్కపోయి ఇరుక్కుపోయిందెవరు.? చివరికి బుక్కయ్యేదెవరు.?
అన్ని పార్టీల నేతలు ఇరుక్కుపోయే పరిస్థితి..!
అనుకోకుండా..ఒక్కసారిగా తెరమీదకు వచ్చిన ల్యాండ్ స్కామ్. ఆరేళ్ల కింద జరిగిన భూఆక్రమణ బాగోతం. ఇప్పుడు సడెన్‌గా హాట్ టాపిక్ అయింది. జగిత్యాల సెంట్రిక్‌గా సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ వర్సెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నట్లుగా మారిపోయింది సీన్. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య పంచాయితీతో ఓ పెద్ద భూకుంభకోణం బట్టబయలైంది.
Also Read : గురుమూర్తి ఒళ్లు గగుర్పొడిచే పని.. భార్య మాధవి మృతదేహం కాలుతున్న సమయంలో
అసైన్డ్ భూముల ఆక్రమణల వెనుక ఎమ్మెల్యే అనుచరులున్నారనే అనుమానంతో విచారణ జరపాలంటూ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి రాసిన లేఖ ఇప్పుడు రచ్చ లేపుతోంది. ఇందులో ఎమ్మెల్యే సంజయ్ అనుచరులు ఎవరూ లేకపోగా..మిగతా అన్ని పార్టీల నేతలు ఇరుక్కుపోయే పరిస్థితి వచ్చిందట.
జీవన్ రెడ్డి వాడిన అస్త్రం బెడిసి కొట్టిందా?
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ టార్గెట్‌గా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వాడిన అస్త్రం బెడిసి కొట్టిందన్న టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యేను ఇరికించబోతే..ఇంకెవరెవరో ఇరుక్కుపోయే పరిస్థితి వచ్చిందన్న టాక్ పొలిటికల్ సర్కిల్స్‌లో నడుస్తోంది. ఎమ్మెల్యే సంజయ్ టార్గెట్‌గా వేసిన బాణం ఇప్పుడు ఆయనకి తప్ప అందరికి తగులుతుందట.
జీవన్ రెడ్డి వేసిన బాణం తగిలి చాలామంది విలవిలలాడుతున్న పరిస్థితి. అయితే ఈ ప్రభుత్వ భూముల కబ్జాల వ్యవహారం మొదలైందే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అనే చర్చ మొదలైంది. ఇదిప్పుడు జీవన్‌రెడ్డికే ఇబ్బందికరంగా మారుతోందట. గత ఆరేళ్లుగా కాంగ్రెస్ ఎమ్మెల్సీగా జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా సంజయ్‌లే ఉన్నారు. అయితే ఇప్పుడే ఈ వ్యవహారం ఎందుకు తెరపైకి జీవన్‌రెడ్డి తెచ్చారనే చర్చ జగిత్యాలో జోరుగా సాగుతోంది.
జీవన్ రెడ్డి రాజేసిన భూపట్టాల వ్యవహారం కాస్త చాలా మంది నేతల పొలిటికల్ కేరీర్‌పై ప్రభావం చూపే అవకాశాలున్నట్లుగా చర్చ సాగుతుంది. జగిత్యాలకు దగ్గరలో ఉన్న నర్సింగపూర్ గ్రామ శివారులోని 437 సర్వే నంబర్‌లోని గల ప్రభుత్వ భూమిని కొందరు అక్రమంగా రిజిస్టేషన్ చేయించుకున్నారనే అంశంపై విచారణ చేయాలంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ రాశారు. దీంతో ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు విచారణ చేపట్టారు.
ఎమ్మెల్యే హయాంలోనే అక్రమాలు జరిగాయనే ప్రచారం..
ప్రాథమికంగా ఇచ్చిన నివేదికలో వంద ఎకరాల ప్రభుత్వ భూమికి అక్రమంగా పట్టాలు వచ్చినట్లుగా అధికారులు చెబుతున్నారు. ధరణి పోర్టల్ ప్రారంభమైన మొదట్లో అక్రమంగా పట్టాలు చేసుకున్నట్లుగా అధికారులు గుర్తించారు. ధరణి పోర్టల్ వచ్చినప్పుడు బీఆర్ఎస్ తరఫున సంజయ్ ఎమ్మెల్యేగా ఉండడంతో ఆయన హయాంలోనే అక్రమాలు జరిగాయనే ప్రచారం మొదలు పెట్టారట జీవన్ వర్గీయులు. భూ కుంభకోణం వ్యవహరం వెనుక ఎమ్మెల్యే హస్తం ఉందని భావించారు. కానీ అధికారుల విచారణలో బయటకు వచ్చిన పేర్లతో సంజయ్‌కి క్లీన్ చిట్ వచ్చినట్లు అయిందన్న చర్చ జరుగుతోంది.
Also Read : గద్దర్‌కు ‘పద్మ అవార్డు’పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
అక్రమంగా కబ్జాలు, రిజిస్ట్రేషన్ల వెనుక రాజకీయ నాయకులే కాదు, అధికారుల కుటుంబ సభ్యులు పేర్లు బయటపడ్డాయి. అయితే ఇక్కడే ఇంకో అసలు ట్విస్ట్ ఉందంటున్నారు ఎమ్మెల్యే సంజయ్. అసలు తాను రాజకీయాల్లోకి రాక ముందే రిజిస్ట్రేషన్లు జరిగాయంటూ.. పరోక్షంగా బాల్‌ని జీవన్ రెడ్డి కోర్టులో వేస్తున్నారు సంజయ్. అంటే జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సయయంలో నర్సింగపూర్ భూములు కబ్జాకు గురయ్యాయేనేది ఎమ్మెల్యే సంజయ్ చెప్పకనే చెప్తున్నారు.
సంజయ్ ఇరకాటంలో పడతారనుకుంటే.. అది ఆయనకే కలిసి వచ్చిందా?
జీవన్‌రెడ్డి ఆనాడు ఎందుకు స్పందించలేదు. ఇంత కాలం ఎందుకు సైలెన్స్‌గా ఉన్నారు. ఇప్పుడే ఎందుకు తెరపైకి తీసుకొచ్చారంటూ భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు పైర్ అవుతున్నారు. భూ కుంభకోణం వ్యవహారంలో సంజయ్ ఇరకాటంలో పడతారనుకుంటే..అది ఆయనకే కలిసి వచ్చినట్లు అయిందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఈ స్థలాన్ని ఎస్సీ, ఎస్టీలకు మంజూరు చేయించి క్రెడిట్ కొట్టేసే ప్లాన్ చేస్తున్నారట ఎమ్మెల్యే సంజయ్.