Women Self Help Groups: మహిళా సంఘాలకు భారీ గుడ్ న్యూస్.. రూ.344 కోట్లు విడుదల.. ఇవాళ్టి నుంచే ఖాతాల్లోకి జమ

రూ.3వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టింది బీఆర్ఎస్ సర్కార్.

Women Self Help Groups: మహిళా సంఘాలకు భారీ గుడ్ న్యూస్.. రూ.344 కోట్లు విడుదల.. ఇవాళ్టి నుంచే ఖాతాల్లోకి జమ

Updated On : July 12, 2025 / 12:15 AM IST

Women Self Help Groups: మహిళా స్వయం సహాయక సంఘాలకు తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. వడ్డీ లేని రుణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.344 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ మేరకు సెర్ప్ కి నిధులు విడుదల చేసింది ఆర్థిక శాఖ. ఇందులో రూ.300 కోట్లు గ్రామీణ మహిళా సంఘాలకు, రూ.44 కోట్లు పట్టణ మహిళా సంఘాలకు కేటాయించారు. శనివారం నుండి ఈ నెల 18వ తేదీ వరకు మహిళా సంఘాల ఖాతాల్లో వడ్డీ సొమ్ము జమ చేయనున్నారు. ఈ నిధులను సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (SERP) ద్వారా జులై 12 నుంచి 18వ తేదీ వరకు మహిళా సంఘాల ఖాతాల్లోకి జమ చేయనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు చెక్కులు పంపిణీ చేయనున్నారు. అంతేకాదు మహిళా సంఘాలకు ప్రమాద బీమా, లోన్ బీమా చెక్కులు సైతం పంపిణీ చేయనున్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. శాశ్వతమైన జీవనోపాధి అవకాశాలు సృష్టించడంలో ఈ నిధులు కీలక పాత్ర పోషించనున్నాయని అంచనా వేస్తున్నారు.

బీఆర్ఎస్ హయాంలో వడ్డీ లేని రుణాలు నిలిచిపోయాయి. రూ.3వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టింది బీఆర్ఎస్ సర్కార్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సకాలంలో వడ్డీ లేని రుణాల చెల్లింపు చేస్తోంది దీంతో మహిళా సంఘాలు ఆర్థిక కార్యకలాపాల్లో అనూహ్య వృద్ధి సాధించనున్నాయి. మంత్రి సీతక్క చొరవతో మహిళా సాధికారతకు ఊతం అందించినట్లైంది.

Also Read: రాజాసింగ్ ప్లేస్‌లో గోశామహల్‌కు బై ఎలక్షన్స్ వస్తాయా?

మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు ఈ రుణాలు మంజూరు చేసింది ప్రభుత్వం. మహిళా సంఘాలకు పావలా వడ్డీకి రుణపథకం 2005లో అమల్లోకి వచ్చింది. బ్యాంకు లింకేజీ రుణాలు తీసుకునే సభ్యులకు వర్తింపజేయగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2016 వరకు ఈ విధానం కొనసాగింది. 2017 తర్వాత పావలా వడ్డీ డబ్బులు వారి అకౌంట్లో వేయడం నిలిపేవేశారు. తొమ్మిదేళ్ల తర్వాత వడ్డీ లేని లోన్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ కసరత్తు చేసింది.