Vijaya milk: రైతులకు గుడ్‌న్యూస్‌.. విజయ పాల సేకరణ ధరలు పెంపు యోచనలో ప్రభుత్వం.. ఎంతంటే?

కర్ణాటక, మహారాష్ట్ర నుంచి అతి తక్కువ ధరలకు పాలు అందుబాటులో ఉంటున్నాయి. దీంతో ప్రైవేట్ డెయిరీలు, కొన్ని కో-ఆపరేటివ్ డెయిరీలు..

Milk

Vijaya Dairy milk: పాడి రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతుంది. రైతుల నుంచి విజయ డెయిరీ సేకరిస్తున్న పాల ధరలను పెంచాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఆవు పాలతోపాటు గేదె పాల సేకరణ ధరలను సవరించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Also Read: Half Day Schools: స్కూల్‌ విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. తెలంగాణలో ఒంటిపూట బడులు..

రాష్ట్రంలో ప్రైవేట్, సహకార డెయిరీలతో పోలిస్తే విజయ డెయిరీ ఎక్కువ మొత్తంలోనే చెల్లిస్తోంది. అయితే, ప్రస్తుతం పాలకు ఉన్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా ధరలను పెంచాలని సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆవు, గేదె పాలపై ఒక్కో లీటర్ కు రూ.2 నుంచి రూ. 3 పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం లీటరు గేదె పాలు రూ.48 వద్ద ఉండగా.. రూ.51దాకా పెంచే ప్రతిపాదన ఉంది. అయితే, త్వరలో ధరల పెంపుపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

Also Read: Gold: బంగారంకు ఎందుకంత డిమాండ్.. పసిడిపై పెట్టుబడి పెడితే కాసుల వర్షం కురిపిస్తోందా.. సెంట్రల్ బ్యాంక్‌లు ఏం చేస్తున్నాయో తెలుసా..

పలు కారణాల వల్ల విజయ తెలంగాణ డెయిరీ పాల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. పక్క రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర నుంచి అతి తక్కువ ధరలకు పాలు అందుబాటులో ఉంటున్నాయి. దీంతో ప్రైవేట్ డెయిరీలు, కొన్ని కో-ఆపరేటివ్ డెయిరీలు పక్క రాష్ట్రాల నుంచి పాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి మార్కెటింగ్ కమీషన్లను పెంచి రాష్ట్రంలో అమ్మకాలను పెంచుకుంటున్నాయి. దీని ప్రభావం విజయ తెలంగాణ అమ్మకాలపై పడుతోంది. దీనికితోడు విజయ పేరుతో కొన్ని డెయిరీలు అక్రమంగా పాల అమ్మకాలు జరుపుతుండటం వల్ల కూడా విజయ తెలంగాణ డెయిరీ పాల అమ్మకాలు తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. దీంతో నష్టాలు రావడంతో రైతులకు పాల బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతుంది.

అయితే, ఇటీవల డెయిరీ యాజమాన్యం పాడి రైతులతో సమావేశమైంది. ఈ సమావేశంలో పాత బకాయిలు చెల్లించేలా ప్రభుత్వాన్ని కోరాలని, ప్రతీ నెలా 5వ తేదీ, 20వ తేదీన పాల బిల్లులు చెల్లించాలని సమావేశం నిర్ణయించింది.