Telangana Govt Debt: మరో 35వేల కోట్లు అప్పు చేయనున్న తెలంగాణ సర్కార్.. ఇప్పటివరకు చేసిన అప్పు ఎంతంటే..

మూసీ సుందరీకరణ కోసం 4వేల 100 కోట్లు కావాలని ఈ ప్రతిపాదనల్లో పేర్కొంది.

Telangana Govt Debt: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం చేపట్టిన పనుల కోసం మరో 35వేల కోట్ల అప్పు తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 35వేల కోట్ల అప్పు కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి కోరింది. ఆర్బీఐ నుంచి వెయ్యి కోట్లు అప్పు తీసుకోనుంది రేవంత్ సర్కార్. ఇందులో యంగ్ ఇండియా స్కూల్స్ కోసం 35వేల కోట్లు ఖర్చు చేయనుంది. మూసీ సుందరీకరణ కోసం 4వేల 100 కోట్లు ఖర్చు చేయాలని భావిస్తోంది. ఈ కొత్త అప్పుతో ఇప్పటివరకు కాంగ్రెస్ సర్కార్ చేసిన అప్పు 2లక్షల 34వేల 500 కోట్లకు చేరింది.

అభివృద్ధి పనుల్లో మరింత వేగం పెంచేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఇందులో భాగంగా అప్పు తీసుకోవాలని నిర్ణయిచింది. రూ.35వేల కోట్ల అప్పు తీసుకోనుంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ కు తన ప్రతిపాదనలు పెట్టింది. వెయ్యి కోట్లను సాధారణ ఖర్చుల కోసం, మూసీ సుందరీకరణ కోసం 4వేల 100 కోట్లు కావాలని ఈ ప్రతిపాదనల్లో పేర్కొంది. అలాగే యంగ్ ఇండియా స్కూల్స్ కోసం 30వేల కోట్లు కావాలని ఆర్బీఐ దృష్టికి తీసుకెళ్లింది.

మొత్తం అప్పు 2లక్షల 34వేల 500 కోట్లకు చేరనుంది. రేవంత్ సర్కార్ 21 నెలల్లోనే అప్పు ఇంతకు చేరుతోంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై కాంగ్రెస్ సర్కార్ తీవ్ర విమర్శలు చేసింది. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. అయితే, ఇప్పుడు రేవంత్ సర్కార్ సైతం అప్పులు చేయక తప్పడం లేదు. అభివృద్ధి పనుల చేయడం కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి.

Also Read: బెంగళూరు-హైదరాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌.. కేవలం 2 గంటల్లో ప్రయాణం.. ఫుల్‌ డీటెయిల్స్‌..