కోవిడ్-19 డిశ్చార్జ్‌కి మార్గదర్శకాలు సవరించిన కేంద్రం

  • Publish Date - May 9, 2020 / 06:59 AM IST

దేశవ్యాప్తంగా కరోనా కలకలం రేగుతున్న సమయంలో కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీచేసింది. కరోనా వైరస్ కారణంగా కొవిడ్‌-19 వ్యాధి భారినపడి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యేవారి విషయంలో కేంద్రం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. లక్షణాల తీవ్రత స్వల్పం, మధ్యస్థంగా ఉన్నవారు వైద్యపర్యవేక్షణలో ఉండాల్సిన సమయాన్ని తగ్గించింది కేంద్రం. 

తద్వారా వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న వారిపై అధిక శ్రద్ధ వహించేందుకు, వారికి సరైన సదుపాయాలు కల్పించేందుకు వెసులుబాటు కలుగుతుందని లేటెస్ట్‌గా విడుదల చేసిన మార్గదర్శకాల్లో కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

సవరించిన మార్గదర్శకాలు:

స్వల్ప లక్షణాలతో ఆసుపత్రి లేదా కొవిడ్‌-19 సంరక్షణా కేంద్రంలో చేరిన వారిలో వరుసగా మూడు రోజుల పాటు జ్వరం లేనట్లయితే లక్షణాలు తగ్గిన 10 రోజుల్లో వారిని డిశ్చార్జ్ చేయవచ్చు. విడుదలకు ముందు ఎలాంటి పరీక్షలు చేయాల్సిన అవసరం లేదు. అయితే, ఇంటి దగ్గర మరో 7 రోజుల పాటు ఏకాంతంగా ఉండాలి.

ఒకవేళ డిశ్చార్జికి ముందు ఎవరిలోనైనా ఆక్సిజన్‌ సాచురేషన్‌ 95శాతం కంటే తక్కువకు పడిపోతే వారిని వెంటనే ప్రత్యేక కొవిడ్‌-19 కేర్‌కు తీసుకెళ్తారు. ఇంటికి చేరుకున్న తర్వాత ఒకవేళ లక్షణాలు తిరగబెడితే వెంటనే కొవిడ్-19 కేర్‌ను సంప్రదించాలి. మరో 14 రోజుల పాటు వారిపై పర్యవేక్షణ కొనసాగుతుంది. అవసరమైతే ఆస్పత్రికి తీసుకెళ్తారు.

మూడు రోజుల పాటు జ్వరం రానట్లయితే.. నాలుగు రోజుల పాటు ఆక్సిజన్‌ సాచురేషన్‌ 95 శాతం కంటే ఎక్కువ ఉంటే.. ఎలాంటి శ్వాససంబంధిత సమస్యలు తలెత్తకపోతే వారిని లక్షణాలు కనిపించిన నాటి నుంచి 10 రోజుల్లో డిశ్చార్జి చేయవచ్చు. ఎలాంటి పరీక్షలు చేయాల్సిన అవసరమూ లేదు. అయితే ఏడు రోజుల పాటు ఇంట్లో ఏకాంతంగా ఉండాల్సిందే. ఒకవేళ జ్వరం తగ్గకపోయినా, ఆక్సిజన్‌ సాచురేషన్‌ పడిపోయినా.. పూర్తి లక్షణాలు తగ్గే వరకు ఆసుపత్రి లేదా సంరక్షణా కేంద్రంలో ఉండాలి.

తీవ్ర లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన వారిలో లక్షణాలు పూర్తిగా తగ్గే వరకు డిశ్చార్జి చేయరాదు. ఒకవేళ లక్షణాలు తగ్గినా.. ఆర్‌టీ-పీసీఆర్‌ నిర్ధారణ పరీక్షలో నెగెటివ్‌ వచ్చే వరకు డిశ్చార్జి చేసే అవకాశం లేదు.

Read More :

జూన్-జులై నెలల్లో కరోనా కేసులు తగ్గిపోవచ్చు!!

ట్రెండింగ్ వార్తలు