జూన్-జులై నెలల్లో కరోనా కేసులు తగ్గిపోవచ్చు!!

  • Published By: Subhan ,Published On : May 9, 2020 / 06:39 AM IST
జూన్-జులై నెలల్లో కరోనా కేసులు తగ్గిపోవచ్చు!!

కరోనా మహమ్మారిని పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వ్యాపించకుండా చూడటమే అత్యంత కీలకమని పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా (PHFI) అధ్యక్షుడు ప్రొఫెసర్‌ శ్రీనాథ్‌ రెడ్డి తెలిపారు. ‘పట్టణాల నుంచి గ్రామాలకు.. హాట్‌స్పాట్ల వైపు నుంచి ఇతర ప్రాంతాలకు జరిగే రాకపోకలను వీలైనంత వరకూ తగ్గించాలి’ అని శ్రీనాథ్‌ రెడ్డి మీడియా ముందు వెల్లడించారు. 

నిత్యావసరాలకు మాత్రమే ట్రాఫిక్‌ను పరిమితం చేయడం ద్వారా కరోనా వైరస్‌ను నియంత్రించవచ్చని అన్నారు. దేశంలో యూత్ ఎక్కువగా ఉండటం మరణాల రేటు తక్కువగా ఉండటానికి కారణం అయ్యుండొచ్చని భావించారు. లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత కూడా సామాజిక దూరం, ఫేస్ మాస్క్‌లు, చేతిని తరచుగా కడుక్కోవడం వంటివి ప్రజలు కొనసాగించాలని ప్రజలకు సూచించారు. 

గ్రామీణ ప్రాంతాల్లో సాధారణంగా ప్రజలు తక్కువగా తిరుగుతుంటారు కాబట్టి కరోనా వ్యాప్తి చెందే అవకాశం కూడా తక్కువగానే ఉంటుందని అభిప్రాయపడ్డారు. కరోనా నిర్ధారణ పరీక్షలు ఎక్కువగా చేస్తున్నప్పుడు కేసులు కూడా ఎక్కువగానే బయటపడతాయన్నారు. ఇలాగే వైరస్‌ వ్యాప్తి ఎలా ఉందో గమనిస్తూ ఉండాలన్నారు. ఎక్కువ ఉష్ణోగ్రతలో వైరస్‌ చనిపోతుందనే వాదనపై స్పష్టమైన సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదన్నారు. 

జూన్-జూలైలో భారతదేశంలో కోవిడ్‌-19 కేసులు పెరిగే అవకాశం గురించి తెలియదన్నారు. జూన్-జూలై నాటికి ఎక్కువ ఉష్ణోగ్రత, అధిక తేమ కలయిక ఉండటంతో కరోనా వైరస్‌లు చురుకుదనం తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. 
 

Read More :

ఒకే జైలులో 77మందికి కరోనా పాజిటివ్

భారత్ లో జూన్-జులైలో కరోనా విశ్వరూపం..ఎయిమ్స్ డైరక్టర్ కీలక వ్యాఖ్యలు