హైదరాబాద్‌లో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు..! అండర్ గ్రౌండ్ టన్నెల్స్ నిర్మాణానికి ప్రభుత్వం రెడీ..

రెండు ప్యాకేజీలతో నిర్మించనున్న ఈ సొరంగ మార్గానికి ప్యాకేజీ 1కి రూ.421 కోట్లు కేటాయించగా, ప్యాకేజ్ 2కి రూ.405 కోట్లతో పరిపాలన అనుమతులు ఇచ్చింది రేవంత్ సర్కార్.

Hyderabad Traffic (Photo Credit : Google)

Hyderabad : హైదరాబాద్ మహా నగరంలో ఇక ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఇందుకోసం కాంగ్రెస్ సర్కార్ అండర్ గ్రౌండ్ టన్నెల్స్ ను భారీ ఎత్తున నిర్మించేందుకు రెడీ అయ్యింది. ఐటీ కారిడార్ లోని గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సిందే. అందుకే ఈ ప్రాంతాలకు కనెక్టివిటీగా ఉన్న కేబీఆర్ పార్కు దగ్గర అండర్ గ్రౌండ్ లో భూగర్భ సొరంగ మార్గాల నిర్మాణాలకి ప్రభుత్వం రెడీ అయ్యింది.

హైదరాబాద్ కే తలమాణికంగా మారనున్న ఈ అండర్ గ్రౌండ్ టన్నెల్స్ నిర్మాణం కోసం పరిపాలన అనుమతులు ఇచ్చింది రేవంత్ సర్కార్. వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలో విపరీతంగా ట్రాఫిక్ కష్టాలు పెరిగిపోతున్నాయి. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దీంతో ట్రాఫిక్ ను తగ్గించే ట్రాఫిక్ ఫ్రీగా హైదరాబాద్ సిటీని మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. హైదరాబాద్ సైబరాబాద్ ను కలిపే సెంట్రల్ పాయింట్ కేబీఆర్ పార్క్. దీని చుట్టూ ట్రాఫిక్ ఫ్రీ చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం.

Also Read : అటు స్టడీ టూర్లు, ఇటు ఆఫీస్ రినోవేషన్లు..! అధికారుల జల్సాలకు కేరాఫ్‌గా బల్దియా..!

దీనిలో భాగంగానే కేబీఆర్ పార్క్ కింద అండర్ గ్రౌండ్ టన్నెల్ నిర్మాణం చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. రెండు ప్యాకేజీలతో నిర్మించనున్న ఈ సొరంగ మార్గానికి ప్యాకేజీ 1కి రూ.421 కోట్లు కేటాయించగా, ప్యాకేజ్ 2కి రూ.405 కోట్లతో పరిపాలన అనుమతులు ఇచ్చింది రేవంత్ సర్కార్. హైదరాబాద్ కే గుండెచప్పుడుగా ఉంటూ పంజాగుట్ట నుంచి హైటెక్ సిటీని కలిపే విధంగా 5 భూ సొరంగ మార్గాలను నిర్మించనుంది ప్రభుత్వం.