New Project (2)
గ్రీన్ చాలెంజ్ ఉద్యమ స్ఫూర్తితో దూసుకుపోతుంది. 2018లో ప్రారంభమైన గ్రీన్ ఛాలెంజ్ రెండు కోట్ల మొక్కలు నాటేవరకు చేరుకుంది. హరా హైతో భరా హై (పచ్చగా ఉంటే నిండుగా ఉంటుంది) నినాదంతో టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ గ్రీన్ చాలెంజ్‌లో ప్రారంభించారు. ఇందులో అనేకమంది ప్రముఖులు పాల్గొని మొక్కలు నాటడంతో పాటు వాటి పరిరక్షణకు చర్యలు తీసుకున్నా రు. గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా ఎంపీ సంతోష్‌కుమార్ మొక్కనాటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ నరసింహన్, నటుడు నాగార్జునను నామినేట్ చేశారు. వారు కూడా మొక్కలునాటి మరొకరిని నామినేట్ చేయడంతో క్రమంగా గ్రీన్ చాలెంజ్ ఉద్యమరూపు సంతరించుకుని రెండుకోట్ల మొక్కలు నాటేవరకు వెళ్లింది.
ప్రముఖులతోపాటు సామాన్యులూ ఇందులో భాగస్వామ్యులయ్యారు. మొక్కలు నాటి సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మధ్యలో లక్ష్యం ఒక కోటికి చేరినప్పుడు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొక్కను నాటారు. ఈ లక్ష్యం ఆదివారం(ఆగస్టు 18,2019) నాటికి 2 కోట్లకు చేరటంతో మరోసారి ఎంపీ సంతోష్ మొక్క నాటారు. 2018లో తాను నాటిన మొక్క ఏపుగా పెరగటంతో దానితో సెల్ఫీ దిగి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. కార్యక్రమంలో ఇగ్నయిటెడ్ మైండ్స్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రతి నిధులు కరుణాకర్‌రెడ్డి, రాఘవ పాల్గొన్నారు. తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో ఇగ్నయిటెడ్ మైండ్స్ అనే స్వచ్ఛంద సంస్థ గ్రీన్ చాలెంజ్‌ను చేపట్టింది. మరో నలుగురు ప్రముఖులకు ఎంపీ సంతోష్ గ్రీన్ చాలెంజ్ విసిరారు. వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, సినీనటుడు అఖిల్ అక్కినేని, జీఎమ్మార్ అధినేత మల్లికార్జున్‌రావులను మొక్కలు నాటాల్సిందిగా కోరారు.
సోషల్ మీడియా వేదికగా గ్రీన్ చాలెంజ్ ట్రెండ్‌గా మారింది. తాజాగా ఎంపీ సంతోష్ కుమార్ 2కోట్ల ఒకటవ మొక్కనాటి విసిరిన సవాల్‌ను వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి స్వీకరించారు. అమెరికా పర్యటన ముగించుకుని రాగానే మొక్కలు నాటి ఫోటోలు పోస్టు చేయనున్నట్లు ట్విట్టర్‌లో తెలిపారు. అలాగే మిథున్‌రెడ్డి కూడా మరికొంతమంది ఎంపీలకు గ్రీన్ చాలెంజ్ విసిరారు. సుప్రియ సులే, శ్రీకృష్ణదేవరాయ, మాగుంట శ్రీనివాసుల రెడ్డికి చాలెంజ్ చేశారు. ఒకరు మొక్కనాటి మరో ముగ్గురు మొక్కలు నాటాలని 2018లో టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ చాలెంజ్ కు విశేషమైన ఆదరణ లభిస్తోంది. పర్యావరణ పరిరక్షణ కోసం ఎంపీ సంతోష్ చేసిన ప్రయత్నానికి ప్రశంసలు అందుతున్నాయి. గ్రీన్ చాలెంజ్ సూపర్ అని అంతా మెచ్చుకుంటున్నారు. ఇలాంటి చాలెంజ్ లతో చెట్ల పెంపకం పెరుగుతుందని, పర్యావరణానికి మేలు చేసిన వారం అవుతామని అంటున్నారు.